#పుష్ప.. 3 రోజుల్లో 1.5 మిలియన్ డాలర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప- ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ అద్భుత వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ ని అధిగమించిందని ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం కలెక్షన్స్ అసాధారణంగా ఉండగా ఆంధ్రాలోనూ ఆశాజనకమైన వసూళ్లను సాధించిందని రిపోర్ట్ అందింది.
మరోవైపు అమెరికాలో ఈ చిత్రం చక్కని వసూళ్లను సాధించింది. అక్కడ ఎన్నారై ల నుంచి థండరింగ్ రెస్పాన్స్ దక్కిందని పంపిణీ వర్గాలు వెల్లడించాయి. #పుష్ప ది రైజ్ అమెరికాలో 3 రోజుల్లో 1.5 మిలియన్ డాలర్ మార్క్ ని చేరుకుంది. క్లాసిక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ -హంసిని ఎంటర్ టైన్ మెంట్ ద్వారా #పుష్పUSA లో విడుదలైంది. ఇక ఇదే హుషారులో పుష్ప 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
పుష్ప ఇప్పటికి సుమారు 10 కోట్లు పైగా అమెరికా బాక్సాఫీస్ నుంచి వసూలు చేసింది. ఇకపైనా మరింతగా రాణిస్తుందని భావిస్తున్నారు. ఒక వైపు యుకే .. యుఎస్ ఏలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా అమెరికా లో తెలుగు సినిమాల హవా సాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తమిళం మలయాళంలో గుడ్ టాక్
పుష్ప కి తెలుగులో నెగెటివ్ రివ్యూలు వచ్చినా తమిళం-మలయాళంలో ఆ సమస్య లేకపోవడం హోప్ ని పెంచింది. పుష్పకు తొలి వీకెండ్ వసూళ్లు అన్నిచోట్లా బావున్నాయి. టాక్ పరంగా నెగిటివిటీ ఉన్నా గానీ బన్నీ మాస్ ఇమేజ్ జనాల్ని థియేటర్ కి రప్పించగలుగుతోంది. ఆదివారం హాలీడే కాబట్టి థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప అసలు రంగు ఏమిటన్నది ఈ సోమవారం నుంచి బయటపడనుంది. ప్రస్తుతానికి పోటీగా ఏ చిత్రం లేకపోవడం పుష్పకి సానుకూల అంశమే. ఇక హిందీలోనూ పుష్ప అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే తెలుగు-హిందీ వెర్షన్లకు భిన్నంగా తమిళం.. మలయాళం భాషల్లో మాత్రం పుష్పకి మంచి రివ్యూలు వచ్చాయి. దాదాపు అన్ని వెబ్ సైట్లు 3 రేటింగ్ ఇచ్చాయి. అక్కడ పెయిడ్ రేటింగ్ లకు ఆస్కారం లేదు కాబట్టి జెన్యూన్ హిట్ గానే భావించొచ్చు.
ఆ రెండు భాషల్లో ఇలాంటి మాస్ కంటెంట్ .. వాస్తవిక సన్నివేశాలు.. ఫారెస్ట్ నేపథ్యంతో వచ్చే సినిమాలు సులువుగా కనెక్ట్ అవుతాయి అనడానికి ప్రూఫ్ లున్నాయి. `పుష్ప` తరహా రగ్ డ్ రస్టిక్ కథాంశాలకు కోలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సాధారణంగా తెలుగు హీరోల్ని తమిళులు తొందరగా ఎంకరేజ్ చేయరు. కానీ `పుష్ప` విషయంలో బన్నీని వాళ్లంతా ప్రోత్సహించినట్లే రివ్యూలు చెబుతున్నాయి. అంటే `పుష్ప` కంటెంట్ కోలీవుడ్ కి అంతగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు.
ఈ రెండు భాషల నుంచి పుష్పకి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి సౌత్ ఇండియాలో బన్నీ హవా తొలి వీకెండ్ సాగింది. తెలుగు ఆడియెన్ నుంచి ఆరంభ వసూళ్లు బావున్నాయి. లాంగ్ రన్ ఉన్నా లేకపోయినా అటు తమిళం.. మలయాళం నుంచి వచ్చే సక్సెస్ పుష్పకు ప్రధాన అస్సెట్ అవుతుందని భావించాలి.