టంగ్ స్లిప్ప‌యితే అనుభ‌వించాల్సిందే!-పూరి జ‌గ‌న్నాథ్

Update: 2020-10-12 04:30 GMT
పూరి మ్యూజింగ్స్ అంటూ రోజుకో విష‌యంపై త‌న‌దైన థియేరీని వినిపిస్తున్నారు డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. ఇటీవ‌ల ఫ్లాప్ సినిమాలు.. రివ్యూస్ ప్ర‌భావంపై పెద్ద లెక్చ‌రే దంచిన పూరి తాజాగా నాలుక‌ని అదుపులో పెట్టుకోవాలంటూ కొత్త ప‌లుకులు వినిపించారు. మ‌నం బాగా క‌ష్ట‌ప‌డుతుంటాం. మ‌న‌కు బెస్ట్ స‌ర్కిల్ కూడా వుంటుంది. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో మ‌న కెరీర్ ఎఫెక్ట్ అవుతూ వుంటుంది. నిజంగా ఒకే ఒక కంప్లైంట్ రోజూ లొడాలొడా వాగే మ‌న నాలుక కెరీర్ ని పాడుచేస్తుంది` అన్నారు.

అది మ‌నం తెలుసుకునేలోపు మ‌న‌ల్ని పోస్ట్ ‌మార్ట‌మ్ చేసి పంచ‌నామా చేసేస్తారు. అందుకే మ‌నం ఏం మాట్లాడుతున్నామో కాన్ ‌స‌న్ ట్రేట్ చేయాలి. అవ‌త‌లివాడ్ని హ‌ర్ట్ చేసి విష‌యాన్ని మాట్లాడొద్దు. మ‌నం మాట్లాడేది పాజిటివ్ కాక‌పోతే నోరు విప్పొద్దు. రెండు పెగ్ లేసిన త‌రువాత మ‌నం ఒక‌టి మాట్లాడితే లోప‌లికెళ్లిన మందు ఇంకోటి మాట్లాడుతుంది. దాంతో వున్న రిలేష‌న్ ‌ల‌న్నీ దొ....తాయ్‌.

``అందుకే తాగితే స్పృహ‌లో వుండాలి. స్పృహ త‌ప్పేలా మాత్రం తాగొద్దు. ఏమీ మాట్లాడ‌కుండా తాగి పడిపోయినా నెమ్మ‌దిగా సొసైటీలో మ‌న క్రెడిబిలిటీ పోతుంది. అది మ‌న‌కు తెలియ‌దు. పాజిటివ్ గా ఏం చెప్పాలో తెలియ‌న‌ప్పుడు నోరుమూసుకుందాం. ఎవ‌రైనా హ‌ర్ట్ అయితే సారీ చెప్పేద్దాం`` అంటూ ఆస‌క్తిక‌రంగా టంగ్ థియేరీ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ స‌మ‌యంలో షూటింగ్ లు ఆగిపోవ‌డంతో పూరి కొత్త‌గా `పూరి మ్యూజింగ్స్‌` అంటూ ఆడియో వాయిస్ ల‌ని వ‌దులుతున్నాడు.

Full View
Tags:    

Similar News