పూరి బ్యాక్ టు బేసిక్స్
దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా బ్యాడ్ టైం లో ఉన్న మాట నిజం. తీసిన ప్రతి సినిమా గురించి అతిశయోక్తిగా ప్రమోట్ చేసుకోవడం తీరా అది విడుదల అయ్యాక కనీస స్థాయిలో కూడా లేక నిర్మాతతో పాటు హీరో ఇమేజ్ కూడా డ్యామేజ్ చేయటం సాధారణం అయిపోయింది. ఆఖరికి కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి మెహబూబా తీస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా ఇవ్వలేకపోయిందనే కామెంట్స్ జోరుగా వచ్చాయి. చిన్న గ్యాప్ తీసుకుని వెంటనే కొత్త వాళ్ళతో సినిమా చేసే ప్లాన్ లో పడ్డాడు పూరి. ఆడిషన్స్ కోసం ప్రకటన ఇచ్చాడు. దానికి స్పందన వస్తుంది కానీ పూరి ఎలాంటి సినిమా తీస్తాడనేదే ఇప్పుడు అందరి మెదళ్లలో నానుతున్న ప్రశ్న. కేవలం పూరి పేరుని చూసే సినిమా కొనే పరిస్థితి లేదిప్పుడు. మార్కెట్ లో ఈ పేరుకే భయపడుతున్నారు. వర్మ తర్వాత నమ్మకం అంతగా పోగొట్టుకున్న వాళ్ళ లిస్ట్ లో నెక్స్ట్ పూరి పేరే ఉందంటే అబద్దం కాదు. ఇదంతా స్వయంకృతాపరాధమే.
ఇప్పుడు పూరి మళ్ళి బేసిక్స్ లోకి వచ్చేసాడు. మామూలుగా ప్రూవ్ చేసుకుంటే సరిపోదు. చాలా సాలిడ్ గా ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసే రేంజ్ సినిమా రావాలి. అప్పుడే పూరి మీద తిరిగి నమ్మకం వస్తుంది. మరి అందరు కొత్తవాళ్లతో చేసే రిస్క్ కలిసొస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టమే. పవన్ కళ్యాణ్-మహేష్ బాబు-రవితేజ లాంటి స్టార్ల తో వరసబెట్టి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడికి ఇలాంటి సిచ్యువేషన్ రావడం మొదటిసారేం కాదు. గతంలో ముప్పలనేని శివ భీమినేని శ్రీనివాస రావు లాంటి దర్శకులు సైతం ఇలాగే ఫెయిల్యూర్స్ వల్ల స్టార్స్ తో చేసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయారు. సిల్లీ ఫెలోస్ లాంటి ప్రయత్నాల ద్వారా భీమినేని కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పూరి ఇప్పటికే చాలా రిస్క్ లో ఉన్నాడు కాబట్టి కొత్త వాళ్ళతో తీసే సినిమాలో అనవసర పైత్యాలకు పోకుండా తీస్తే ఆదరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. మరి పూరి మనసులో ఎలాంటి కథ రూపొందుకుందో వేచి చూడాలి.