• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరిలో ఈ కళ కూడా ఉందా?

పూరిలో ఈ కళ కూడా ఉందా?

By - Tupaki Desk
Update: 2017-04-01 06:00 GMT
పూరి జగన్నాథ్ దర్శకుడు.. రచయిత.. అప్పుడప్పుడూ నటిస్తూ కూడా ఉంటాడు. ఒకట్రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. ఐతే ఆయనలో ఇంకో కళ కూడా ఉందని ‘రోగ్’ సినిమాతో వెల్లడైంది. ఈ చిత్రంలో పూరి కొరియోగ్రాఫర్ అవతారం కూడా ఎత్తడం విశేషం. టైటిల్ కార్డ్స్ లో కొరియోగ్రాఫర్ల పేర్లు పడ్డపుడు అందులో పూరి పేరు కూడా కనిపించింది. ఐతే పూరి పర్టికులర్ గా ఏ పాటకు కొరియోగ్రాఫ్ చేశాడన్నది వెల్లడించలేదు. సినిమాలోని పాటల్ని పరిశీలిస్తే.. తొలి పరవశమే అనే పాటకు ఆయన కొరియోగ్రఫీ అందించి ఉండొచ్చనిపిస్తుంది. ఈ పాట చాలా రొమాంటిగ్గా.. ఎరోటిగ్గా సాగుతుంది. అడవిల కొండ వాలు దగ్గర నీళ్లున్న అందమైన ప్రదేశంలో ఈ పాటను చాలా బాగా తీశారు.

ప్రకృతి అందాలకు తోడు హీరోయిన్ అందాలు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి ఈ పాటలో. ఈ సాంగ్ చూస్తే.. ఇది రెగ్యులర్ కొరియోగ్రాఫర్లు కంపోజ్ చేసినట్లుగా అనిపించదు. కొంచెం చిత్రమైన విజువల్స్.. స్టెప్స్.. ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తాయి ఈ పాటలో. ఇంకా హీరోయిన్ చెట్టును వాటేసుకోవడం.. హీరో హీరోయిన్ వెనుకభాగంలో టచ్ చేయడం.. హీరోయిన్ వైపు ఆబగా చూడటం.. ఇలాంటి పూరి మార్కు విజువల్స్ కనిపిస్తాయి ఇందులో. ఐతే ఈ కొత్త కళల మాటేమో కానీ.. పూరి అసలు కళను వదిలేస్తున్నాడన్నదే ఆయన అభిమానుల ఆందోళన. ఈ మధ్య ఆయన సినిమాల్లో క్వాలిటీ బాగా తగ్గిపోతోంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ‘రోగ్’. అసలే ఈ సినిమాపై హైప్ లేకపోగా.. టాక్ కూడా చాలా బ్యాడ్ గా ఉండటంతో పూరి ఖాతాలో మరో ఫ్లాప్ పడటం ఖాయమని తేలిపోయింది.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Puri Jagannath 
  • Rogue Movie 
  • Telugu nEws 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS