• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ కేసు: రెండున్నర...

డ్రగ్స్ కేసు: రెండున్నర గంటలకు పైగా సాగుతున్న పూరీ విచారణ..!

By - Tupaki Desk
Update: 2021-08-31 08:46 GMT
నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు.. మళ్ళీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు విచారించిన ఈ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కలుగజేసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి సినీ ప్రముఖులతో సహా 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఈరోజు (ఆగస్ట్ 31) డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను విచారణకు రావాలని ఈడీ ఆదేశించగా.. నేడు మంగళవారం పూరీ ఈడీ ఎదురు హజరయ్యారు. తన చార్టెడ్ అకౌంట్ ‏తో కలిసి హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వచ్చారు.

డ్రగ్స్ వ్యవహారాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా పూరీ విచారణ కొనసాగుతోంది. చార్టెడ్ అకౌంట్ సహాయంతో ఈడీ అధికారుల ప్రశ్నలకు పూరీ సమాధానాలు ఇస్తున్నారని తెలుస్తోంది. బ్యాంక్, ఆన్లైన్ లావాదేవీల పై ఈడీ దృష్టి సారించిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణం వివరాలు సేకరిస్తున్నారు.

డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు సంబంధించి 2015 నుండి 2021 వరకు బ్యాంక్ లావాదేవీలను ఈడీ కోరింది. పూరీ తన 3 బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను అందించారని సమాచారం. మిగతా 11 మందిని కూడా గత 6 సంవత్సరాల బ్యాంక్ లావాదేవీలను సమర్పించమని ఈడీ నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, అబ్కారీ శాఖ సిట్ అధికారుల నుండి వివరాలను సేకరించిన ఈడీ.. షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులను కోరింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తోన్న ఈడీ.. ఈ 12 మందిని సాక్షులుగా మాత్రమే ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ జరిగిందని రుజువైతే వీరిపై కేసులు నమోదు చేస్తుంది. రాబోయే రోజుల్లో చార్మీ కౌర్ - రానా దగ్గుపాటి - రకుల్ ప్రీత్ సింగ్ - రవితేజ - నవదీప్ - ముమైత్ ఖాన్ - తరుణ్ - నందు - తనీష్ - రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లు ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
Tags:    
  • Puri Jaganadh 
  • Puri Jaganadh movies 
  • Puri Jaganadh hits and flops 
  • Puri Jaganadh latest movies 
  • Puri drugs Issue 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS