• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇది నా సెకండ్ ఇన్నింగ్స్...

ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ .. 'లైగర్' నా ఫస్టు మూవీ: పూరి

By - Tupaki Desk
Update: 2022-08-20 08:08 GMT
టాలీవుడ్ దర్శకులలో పూరి జగన్నాథ్ ట్రాక్ సెపరేటు. చకచకా కథలు అల్లేయడం .. అంతే స్పీడ్ గా వాటిని సెట్ పైకి తీసుకుని వెళ్లడం .. అక్కడి నుంచి తెరపైకి తీసుకు రావడం చేస్తుంటాడు. ఎంత పెద్డ స్టార్ తో సినిమా అయినా ఆయన 6 నెలల్లోనే థియేటర్ కి తీసుకుని వచ్చేస్తాడు. అలాంటిది 'లైగర్' సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి మాత్రం దాదాపు మూడేళ్లు పట్టింది. పాండమిక్ ప్రభావాన్ని పక్కకి పెట్టినా, ఆయన తీసుకున్న సమయం ఎక్కువే. తాజా ఇంటర్వ్యూలో చార్మీ నుంచి ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది.

అందుకు పూరి స్పందిస్తూ .. "పాండమిక్ కి ముందు నా సినిమాలు వేరు .. పాండమిక్ తరువాత నా సినిమాలు వేరు అని డిసైడ్ అయ్యాను. అలా వచ్చిన నా ఫస్టు మూవీగా 'లైగర్' ను భావిస్తున్నాను.

ఒక రకంగా ఇది నా ఫస్టు మూవీ .. నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఇక నుంచి చేసే సినిమాలన్నీ టైమ్ తీసుకుని .. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. ఇంతకుముందు కొన్ని ప్రయోగాలను గబగబా చేసేశాను. ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పది సినిమాలు చేసినా  .. లైఫ్ టైమ్ గుర్తుండిపోయేవి చేస్తాను" అన్నాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "లైఫ్ లో చేస్తే పెద్ద సినిమా చేయాలి .. అది ఒక రేంజ్ లో షేక్ చేయాలి అనుకునేవాడిని. అదే ఆలోచనతో పూరిగారు ఉన్నారు. ఆయనను కలవడం వలన నేను అనుకున్నది నెరవేరబోతోందనే విషయం నాకు అర్థమైపోయింది. పూరిగారిపై గల నమ్మకమే ఆయనతో మరో సినిమా చేయడానికి కారణమైంది.

ఇక మొదటి నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఉండటానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు. అయితే ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన నన్ను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్లకి టచ్ లో ఉండటం కోసం నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాను.

 నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడే ఒకసారి కమిట్ అయితే ఏం చేయడానికైనా .. తెరపై ఎలా కనిపించడానికైనా వెనుకాడవద్దని నిర్ణయించుకున్నాను. పూరి గారు నాకు కథ చెప్పినప్పుడే 'లైగర్' లుక్ ఎలా ఉండాలనేది నాకు అర్థమారిపోయింది. పూరి గారు అంత కష్టపడి ఆ పాత్రను రాస్తే, నా లేజీనెస్ వలన దానిని పాడు చేయకూడదు. ఆ పాత్రలో మజా రావాలంటే కండలు పెంచాల్సిందే .. లేదంటే మజా రాదు. కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి నేను కష్టపడవలసిందే. ఇప్పుడు కాకపోతే ఇలాంటివి ఇంకా ఎప్పుడు చేయగలుగుతామని  రంగంలోకి  దిగిపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    
  • BollywoodActress 
  • AnanyaPandey 
  • LigerMovie 
  • VijayDevarakonda 
  • PuriJagannath 
  • KaranJohar 
  • CharmeeKaur 
  • FilmIndustry 
  • PuriConnectsBanner 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS