• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఫైటర్' నిర్మాణంలో పూరీ...

'ఫైటర్' నిర్మాణంలో పూరీ తగ్గేలా లేడుగా.. క్లైమాక్స్ కోసం భారీ సెట్..

By - Tupaki Desk
Update: 2020-11-15 04:00 GMT
పూరీ జగన్నాథ్, సెన్సేషనల్ స్టార్  విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ‘ఫైటర్’ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ వరుస విజయాలతో స్టార్ డం సాధించిన విజయ్ దేవరకొండ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ కథకు పాన్ ఇండియా అప్పీల్  వుండడంతో పూరీ దీనిని  ఛార్మితో కలసి  పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తున్నాడు. కరోనాతో కొద్ది రోజులు షూటింగ్ కి  బ్రేక్ పడ్డ ఈ  సినిమా తొందర్లోనే మళ్లీ సెట్స్ పైకి వెళుతోంది.

 ఫైటర్ కథ నచ్చడంతో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ  సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. అతడి ఇన్వాల్మెంట్ ఉండటంతో బాలీవుడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కూడా చాలా రోజులుగా బాలీవుడ్ లో అడుగు పెట్టాలని కలలు కంటున్నాడు. అందుకే విజయ్ ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా   ఓ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ సిద్ధం చేస్తున్నారట. వచ్చే నెల రెండో వారం నుంచి  ఈ సెట్ లో భారీ ఫైట్ సీన్ షూట్ చేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఫైటర్ సినిమా కథ ఓ డాన్ అతని కొడుకు మధ్య నడుస్తోందని సమాచారం. డాన్ కొడుకు రోల్ లో  విజయ్ కనిపిస్తారు. సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ స్టైలిష్ గా మారారు. పొడవాటి జుట్టు తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలకు ప్రాముఖ్యం ఉండడంతో అందుకోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ తో బాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు సాధిస్తాడో వేచి  చూడాలి.
Tags:    
  • Vijay devarakonda 
  • Vijay devarakonda Latest Movies 
  • Vijay devarakonda Latest Updates 
  • Vijay devarakonda Movies 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS