అస‌లింత‌కీ పుల్లెల గోపిచంద్ బ‌‌యోపిక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?

Update: 2020-09-04 05:45 GMT
భారత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెలా గోపిచంద్ విశిష్టమైన జీవితంపై బయోపిక్ తెర‌కెక్క‌నుంద‌న్న సంగ‌తి తెలిసిందే. గోపిచంద్ క్రీడా జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తామ‌ని ఆయ‌న స్నేహితుడు హీరో సుధీర్ బాబు చాలాసార్లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గత కొన్నేళ్లుగా హాట్ టాపిక్ గానే ఉన్నా ఎందుక‌నో ఇంకా టేకాఫ్ కాలేదు. ప్రవీణ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ స్పోర్ట్స్ డ్రామాలో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటించనున్నారని ప్ర‌చార‌మైంది.

అస‌లింత‌కీ ఈ బ‌యోపిక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా? అంటే.. తాజాగా వి ఇంటర్వ్యూలో సుధీర్ బాబు స‌మాధానం ఇచ్చారు. 2020లో లేన‌ట్టే. 2021లో పాన్-ఇండియా స్థాయిలో ఈ బయోపిక్ ని తెర‌కెక్కిస్తామ‌ని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో అధికారిక లాంచ్ ఉంటుంద‌ని తెలిపారు.

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - అబుండాంటియా ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇది తెలుగు- తమిళం- హిందీ భాషలలో విడుదల కానుందని సుధీర్ బాబు వెల్ల‌డించారు. `వి` చిత్రం రిజ‌ల్ట్ మ‌రో 24 గంట‌ల్లో తేల‌నుంది. ఈ సినిమా సుధీర్ బాబుని న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కిస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. అత‌డి కాప్ గెట‌ప్ స‌హా న‌ట‌న లో షార్ప్ నెస్ ట్రైల‌ర్ చూస్తే అర్థమ‌వుతోంది. ఆ గ్రిప్ ఆద్యంతం నిల‌బెడ‌తాడ‌నే భావిస్తున్నారు.
Tags:    

Similar News