• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #PSPKRana లీక్ వీడియో...

#PSPKRana లీక్ వీడియో వైరల్.. పవన్ తో రానా ఢీ..!

By - Tupaki Desk
Update: 2021-07-30 12:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా '#PSPKRana' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన రిటైర్ట్ హవల్దార్‌ పాత్రలో రానా నటిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇక రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేస్తూ.. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు తాజాగా 'ఏకే' రీమేక్ షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ - నిత్యామీనన్ లతో రానా వాగ్వాదానికి దిగడం కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కు రానా వార్నింగ్ ఇస్తుండటంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సమయంలో పంచె కట్టులో ఉన్న రానా డిఫరెంట్ యాటిట్యూట్ తో కనిపిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు రఘుబాబు కూడా ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో '#PSPKRana' ను ట్రెండింగ్ లో నిలిపింది. మొత్తం మీద ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - రానా మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయిని ఈ లీకైన వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఇకపోతే పవన్ చిత్రాలకు మొదట నుంచీ ఈ లీకుల బెడద వస్తూనే ఉంటుంది. కకాకపోతే అవి పవర్ స్టార్ చిత్రాలకు ప్లస్ అవుతుంటాయి. గతంలో 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే నెట్టింట ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అయితే లీకులు అనేవి పవన్ కు కలిసొస్తాయని సెంటిమెంట్ గా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోని డిలీట్ చేయకుండా వైరల్ చేసేస్తున్నారు.

కాగా, 'పవన్ - రానా' చిత్రం ఇద్దరు వ్యక్తుల ఇగోల కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసున్నాయనే కథాంశంతో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ స్క్రిప్టులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మాతృకలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని జత చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. పవన్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరి దృష్టి పడింది.

'వకీల్ సాబ్' తర్వాత ఎస్ ఎస్ థమన్ మరోసారి పవన్ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ళ స్థానంలో రవి కె చంద్రన్ జాయిన్ అయ్యారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 12 గా ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా 'PSPKRana' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతోంది. పవన్ - రానా లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
Tags:    
  • PSPK 
  • Rana 
  • Movie news 
  • latest News 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS