• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  30 ఇయర్స్ పృథ్వీ.. హాట్...

30 ఇయర్స్ పృథ్వీ.. హాట్ అంటే హాట్

By - Tupaki Desk
Update: 2015-12-04 19:51 GMT
కొందరు హఠాత్తుగా స్టార్లయిపోతారు.. కొందరు ఒక్కో మెట్టూ ఎక్కి పై స్థాయికి చేరతారు. హీరోల్లో మాత్రమే కాదు.. కమెడియన్లలోనూ ఇలా రెండు రకాల వాళ్లూ ఉంటారు. ఈ రెండో కేటగిరికి చెందిన నటుడే 30 ఇయర్స్ పృథ్వీ. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఊతపదంలో పాపులరైన పృథ్వీ.. నిజంగానే 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం విశేషం. ఐతే అతడికి సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. గత ఏడాది ‘లౌక్యం’ సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్రతో అతడి దశ తిరిగింది. సరిగ్గా బ్రహ్మానందం డౌన్ అయిపోతున్న సమయంలోనే రైజ్ అయిన పృథ్వీ నెమ్మదిగా ఆ స్టార్ కమెడియన్ ప్లేస్ ను రీప్లేస్ చేసే స్థాయికి ఎదుగుతున్నాడు.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘శంకరాభరణం’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకున్నది పృథ్వీ క్యారెక్టరే. పర్సంటేజ్ పరమేశ్ గా తనదైన కామెడీ టైమింగ్, పంచ్ పవర్ తో చెలరేగిపోయాడు పృథ్వీ. ముఖ్యంగా సెకండాఫ్ సినిమా అంతా పృథ్వీ కామెడీ మీదే నడిచింది. సినిమాలో అందరినీ డామినేట్ చేస్తూ తనదైన శైలిలో నవ్వించాడు పృథ్వీ. చివరికి సినిమా రిజల్ట్ గురించి చెప్పమంటే పృథ్వీ కోసం చూడొచ్చు అని ఆడియన్స్ అంటున్నారంటే జనాలు అతడి కామెడీతో ఎలా కనెక్టయ్యారో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం మరో విశేషం ఏంటంటే..  సాయంత్రం రిలీజైన ‘సౌఖ్యం’ ట్రైలర్లోనూ పృథ్వీనే హైలైట్ అయ్యాడు. అందులో బాహుబలికి స్పూఫ్ గా పృథ్వీ శివలింగాన్ని మోసే సీన్ కు సంబంధించిన ఫొటోస్, క్లిప్స్ సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. మొత్తానికి ఒకే రోజు రెండు సినిమాల్లో తన ప్రత్యేకత చూపించి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు పృథ్వీ.
Tags:    
  • Prudhvi Comedy 
  • ShankaraBHaranam 
  • Soukhyam 
  • Baahubali Spoof in Soukhyam 
  • Telugu News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS