• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చియాన్​ విక్రమ్​ కి...

చియాన్​ విక్రమ్​ కి తాతయ్యగా ప్రమోషన్

By - Tupaki Desk
Update: 2020-11-10 11:10 GMT
విలక్షణ నటుడు, చియాన్ విక్రమ్ తాత అయ్యారు. విక్రమ్ కూతురు అక్షిత సోమవారం ఆడబిడ్డకు జన్మినిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మునిమనువడు మను రంజిత్‌ను అక్షిత 2017లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దంపతులకు కూతురు పుట్టడంతో విక్రమ్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. విక్రమ్ ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఇక తన మనవరాలితో సరదాగా ఆడుకోవచ్చని సంబురపడిపోతున్నాడు. కరోనా వల్ల ఈ అకేషన్ ని అందరితో కలసి సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో విక్రమ్ కుటుంబీకుల వరకే సంబరాల్లో మునిగిపోయారు.

కాగా, విక్రమ్ కొడుకు ధృవ్ తెలుగులో విజయవంతం అయిన అర్జున్ రెడ్డి మూవీని `ఆదిత్య వర్మ` పేరుతో రీమేక్ చేయగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. విక్రమ్ లాగే ధృవ్ కూడా మంచి నటుడు అని పేరు తెచ్చుకోవడంతో విక్రమ్ సంతోషంలో ఉన్నాడు. ఇప్పుడు తన మనవరాలి రాకతో విక్రమ్ కి సంతోషం రెట్టింపు అయ్యింది. మరోవైపు చియాన్ విక్రమ్ ‘డిమోంటి కాలనీ’ ఫేమ్‌ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మంగళవారం పఠాన్ పుట్టినరోజు సందర్భంగా కోబ్రా నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో అస్లన్‌ ఇల్మజ్‌ ఏ ఫ్రెంచ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఆకట్టుకున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.


Tags:    
  • Movies 
  • Movie News 
  • Latest news 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 

Similar News

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా చేసేనా?

2026-11-14 16:26 GMT

హీరో అన్నారు...విలన్ ని చేశారు

2026-11-14 16:26 GMT

రావిపూడి.. ఎన్టీఆర్‌తో ఏం ప్లాన్ చేస్తున్నవయ్యా..?

2026-11-14 16:25 GMT

నితిన్ సినిమా కోసం నాని.. ప్రమోషన్స్ లో కూడా ఇలా..

2026-11-14 16:21 GMT

దిల్ రాజు కన్ఫ్యూజన్‌లో పెట్టాడు

2026-11-14 15:45 GMT

'వార‌ణాసి'లో శ్రుతిహాస‌న్ ? ఏంటా క‌థ‌!

2026-11-14 15:30 GMT

సుకుమార్ కథ ఎన్ని గంటలు చెబుతాడో తెలుసా?

2026-11-14 14:30 GMT

హీరోల‌కు సమ ఉజ్జీగా నిలిచిన విలక్షణ నటుడు గిరిబాబు

2026-11-14 14:15 GMT

Copyright @2026

Powered by Blink CMS