• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వార‌ణాసి'లో శ్రుతిహాస‌న్...

'వార‌ణాసి'లో శ్రుతిహాస‌న్ ? ఏంటా క‌థ‌!

| రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’లో శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ లేదు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో శ్రుతి ప్రత్యేక గీతం ఆలపించి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె నటిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

By - Srikanth Kontham
Update: 2026-11-14 15:30 GMT

సూపర్ స్టార్ మహేశ్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న చిత్రం `వార‌ణాసి`.ఈ సినిమా మొద‌లైన నాటి నుంచి ప్రాజెక్ట్ గురించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తుంద‌ని ప్రచారం జరుగుతోంది. కానీ శ్రుతి హాస‌న్ పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం అధికారికంగా లేవు. మ‌రి ఈ ప్రచారం వెనుక అసలు నిజం ఏంటి?

శ్రుతిహాసన్ `వారణాసి` చిత్రంలో నటిస్తోందన్న ప్రచారానికి ఆ సినిమాలోని ప్రత్యేక గీతానికి మధ్య చిన్న గందరగోళం ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ సందర్భంగా ఓ పవర్‌ఫుల్ పాటను శ్రుతిహాసన్ ఆలపించడమే కాకుండా వేదికపై అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చారు. ఈ మ్యూజికల్ కొలాబరేషన్ కారణంగానే శ్రుతి సినిమాలో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో తాజాగా ప్ర‌చారం ఊపందుకుంది. రాజమౌళి సినిమాల్లో నటీనటుల ఎంపిక గోప్యంగా జరుగుతుందనే విషయం తెలిసిందే.

`వారణాసి` చిత్రంలో మహేశ్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పృథ్వీ పాత్ర‌కు జోడీగా శ్రుతి న‌టిస్తుందా? అన్న అనుమానం లేక‌పోలేదు. ఆ ర‌క‌మైన ర‌హ‌స్యం రాజ‌మౌళి మెయింటెన్ చేసినా? ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. అయితే ఈ ప్ర‌చారంపై ఇప్పటి వరకు యూనిట్ ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. కేవలం శ్రుతి పాడిన పాట..ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మెన్సే ఈ ఊహాగానాలకు కారణమని తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రుతిహాసన్ ఇతర ప్రాజెక్ట్‌లతో పాటు మ్యూజికల్ కెరీర్‌పై కూడా దృష్టి సారిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు గాయనిగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వార‌ణాసిలాంటి గ్లోబ‌ల్ వైడ్ రిలీజ్ సినిమాలో శ్రుతి హాస‌న్ నిజంగానే భాగ‌మైతే శ్రుతి కెరీర్ ట‌ర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు. అమ్మ‌డి ట్యాలెంట్ 120 దేశాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్ కి ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన అనుభ‌వం కొంత ఉంది. `వార‌ణాసి` హిట్ అయితే ఆ క్రేజ్ రెట్టింపు అవుతుంది. హాలీవుడ్ లో మ‌రిన్ని కొత్త అవ‌కాశాల‌కు గేట్లు తెరుచు కుంటాయి. మ‌రి నిజంగా వార‌ణాసిలో న‌టిస్తుందా? లేదా? అన్న‌ది క్లారిటీ వ‌స్తే గానీ అస‌లు సంగ‌తేంటి? అన్న‌ది తెలియ‌దు.

Tags:    
  • varanasimovie 
  • maheshbabu 
  • rajamouli 
  • shrutihaasan 
  • priyankachopra 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS