• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజు కన్ఫ్యూజన్‌లో...

దిల్ రాజు కన్ఫ్యూజన్‌లో పెట్టాడు

| 2028 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తమ బ్యానర్‌పై సినిమా విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే హీరో ఎవరనేది వెల్లడించలేదు. పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. చిరంజీవితో మరోసారి అనిల్ సినిమా చేసే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది.

By - Ramesh Palla
Update: 2026-11-14 15:45 GMT

రామాయణ, సీన్‌ సినిమాలను పంపిణీ చేసిన దిల్‌ రాజు ఆ సినిమాల సక్సెస్‌ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా దిల్‌ రాజు స్వయంగా తాను పంపిణీ చేసిన సినిమాల విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఒక్కడే మీడియా ముందుకు వచ్చాడు. ఆయా సినిమాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎవరూ లేకుండా కేవలం దిల్‌ రాజు మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. రెండు సినిమాల పోస్టర్‌ లతో దిల్‌ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొత్త సంప్రదాయానికి తెర తీసినట్లు అయింది. టాక్సిక్ సమయంలో తనను కొందరు కావాలని ట్రోల్‌ చేశారని, ఆ సమయంలో తన గురించి డబ్బులు ఇచ్చి మరీ తప్పుడు ప్రచారం చేయించారు అంటూ దిల్‌ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.

దిల్ రాజు ప్రెస్‌ మీట్‌లో...

ఆ ప్రెస్‌ మీట్‌ లోనే దిల్‌ రాజు పలు అంశాలను ప్రస్తావిస్తూ వచ్చాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నట్లు దిల్‌ రాజు ప్రకటించాడు. అంతే కాకుండా 2028 సంక్రాంతికి తమ బ్యానర్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా వస్తుందని అధికారికంగా ప్రకటించాడు. దిల్‌ రాజు వంటి పెద్ద నిర్మాత అలాంటి వ్యాఖ్యలు ఊరికే చేయడు. పక్కా ప్లానింగ్‌ ఉండటం వల్లే దిల్‌ రాజు నోటి నుంచి ఆ మాట వచ్చి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనిల్‌ రావిపూడి తర్వాత సినిమా కన్ఫర్మ్‌ అయిందని తేలిపోయింది. ప్రస్తుతం వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌లతో జనవరి 12 విడుదల సినిమాను చేస్తున్న అనిల్‌ రావిపూడి 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అనిల్‌ రావిపూడి గత మూడు ఏళ్లుగా వరుసగా సంక్రాంతికి తన సినిమాలతో వస్తున్న విషయం తెల్సిందే.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత...

2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాను దిల్‌ రాజు నిర్మించాడు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు తో వచ్చాడు. రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనిల్ రావిపూడి అంతకు ముందు కూడా సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే 2028లోనూ ఆయన సంక్రాంతి మూవీ ముందుగానే కన్ఫర్మ్‌ అయింది. దిల్‌ రాజుతో వరుసగా సినిమాలు చేస్తున్న అనిల్‌ రావిపూడి తదుపరి సినిమా సైతం ఆయన నిర్మాణంలో తేలిపోయింది. అయితే హీరో ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. దిల్‌ రాజు అదే ప్రెస్ మీట్‌ లో పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా ఉంటుంది అంటూ ప్రకటించడంతో చాలా మంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్ హీరోగా దిల్‌ రాజు బ్యానర్‌ లో సినిమా ఉంటుందని భావిస్తున్నారు.

2028 సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా...

ఉప ముఖ్యమంత్రిగా ఫుల్‌ బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ తో అనిల్‌ రావిపూడి సినిమాను మొదలు పెడితే కచ్చితంగా అది 2028 సంక్రాంతికి విడుదల చేయడం సాధ్యం కాదు. పైగా అనిల్‌ మార్క్ కామెడీ పవన్‌ కళ్యాణ్‌ తో వర్కౌట్‌ కాకపోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే పవన్ కళ్యాణ్‌ తో అనిల్‌ రావిపూడి సినిమా అనేది పూర్తిగా అవాస్తవం. అయితే ఎవరితో అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. చిరంజీవితో మరోసారి అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కనుక 2028 లో మళ్లీ మెగా మూవీతో అనిల్ రావిపూడి సంక్రాంతి సీజన్‌కి వస్తాడా అనేది చూడాలి. మొత్తానికి దిల్‌ రాజు 2028 సంక్రాంతి సినిమా గురించి మాట్లాడి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు కన్ఫ్యూజన్‌లోకి నెట్టడం జరిగింది. అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేసినా కచ్చితంగా 2028 సంక్రాంతికి దిల్‌ రాజు హిట్‌ అందుకోవడం ఖాయం అని ఇప్పటి నుంచే ప్రచారం మొదలైంది. ఈ సస్పెన్స్ కు తెర పడేది ఎప్పుడో చూడాలి.

Tags:    
  • anilravipudi 
  • dilraju 
  • sankranthi2028 
  • pawankalyan 
  • chiranjeevi 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS