ఐదు ల‌క్ష‌ల మంది నిర్మించిన సినిమా ఇది

Update: 2022-10-06 10:30 GMT
సాధార‌ణంగా ఒక సినిమా నిర్మాణంలో ఎంత మంది భాగ‌మ‌వుతారు. ముగ్గురు లేదా న‌లుగురు.. లేదా ఇంకా అద‌నంగా క‌లుపుకుంటే  ప‌ది ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు వేసుకోవ‌చ్చు. అదీ ఇలాంటి భాగ‌స్వామ్యం సౌత్ లో  పెద్ద‌గా క‌నిపించ‌దు. బాలీవుడ్ లోనే  ఎక్కు వగా చూస్తుంటాం. నిర్మాణ సంస్థ‌లు భాగ‌స్వామ్యంలో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించ‌డం అక్క‌డే  జ‌రుగుతుంటుంది.

అక్క‌డా కూడా ప‌ది సంస్థ‌ల‌కు మించి ఉండ‌దు. కానీ ఆ ఒక్క సినిమా కోసం మాత్రం ప‌దికాదు..ఇర‌వై కాదు..వంద కాదు..వేలు కాదు.. ఏకంగా ఐదు ల‌క్ష‌ల మంది నిర్మాణంలో భాగ‌మ‌య్యారంటే? న‌మ్ముతారా? న‌మ్మాల్సిన నిజ‌మేనా అంటే?  న‌మ్మాల్సిందే. న‌మ్మి తీరాల్సిందే. న‌మ్మ‌క త‌ప్ప‌ని వాస్త‌వ‌మిది.

ఆ చిత్ర‌మే 'మంథ‌న్'. దేశంలో పాల ఉత్ప‌త్తి ని పెంచ‌డంలో విశేష కృషి చేసి.. శ్వేత విప్ల‌వ పితామ‌హుడిగా పేరుగాంచిన వ‌ర్గీస్ కురియ‌న్ జీవిత చరిత్ర ఆధారంగా  'మంథ‌న్' తెర‌కెక్కింది. దీనికి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు శ్యాంబెన‌గ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌ర్గీస్ రాక‌తో  గుజ‌రాత్ పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. దీంతో ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగ‌స్వామ్యం వ‌హించ‌డం స‌ముచితం అని భావించి  బెన‌గ‌ల్  గుజ‌రాత్ కో ఆప‌రేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడెరేష‌న్ ని రంగంలోకి దించారు.

బెన‌గాల్ ప్రపోజల్ కి క‌మిటీ వెంట‌నే అంగీక‌రించింది. ఈ ఫెడరెష‌న్ లో ఐదు లక్ష‌ల మంది భాగ‌స్వాములు. ఒక్కొక్క‌రు త‌ల‌కి రెండు రూపాయ‌లు చొప్పున ఇచ్చారు. ప్ర‌పంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా మంథ‌న్ రికార్డు  అప్ప‌ట్లో సృష్టించింది.  మ‌న దేశంలో అయితే తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా చ‌రిత్ర‌లోనే నిలిచిపోయింది.

ఈ సినిమా విజ‌య‌వంతం అవ్వాల‌ని అప్ప‌ట్లో  రైతులు  ఎద్దుల బ‌ళ్ల‌పై గుంపులుగా థియేట‌ర్ల‌కు త‌ర‌లి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రం ప‌లు జాతీయ పుర‌స్కారాలు ద‌క్కిచుకుంది. ఇందులో  గిరీశ్ క‌ర్నాడ్..స‌రీరుద్దీన్ షా...అమ్రిష్ పురీ..స్మితా పాటిల్  త‌దిత‌రులు న‌టించారు. 134 నిమిసాల నిడివిగ‌ల సినిమా  1976లో రిలీజ్ అయింది.

వ‌న్ రాజ్ భాటియా సంగీతం అందించారు. 70వ ద‌శ‌కం త‌ర్వాత‌..ముందు మ‌ళ్లీ ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. భ‌విష్య‌త్ లో జ‌రిగే అవ‌కాశం కూడా లేద‌ని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News