ఓటీటీ మరియు సినిమాల డిజిటల్ రిలీజ్ పై స్టార్ ప్రొడ్యూసర్

Update: 2020-04-17 04:50 GMT
ఒకప్పుడు సినిమాలు చూడాలంటే కేవలం సినిమా థియేటర్స్ మాత్రమే ఉండేవి.. ఆ తరువాత టీవీలు వచ్చాయి.. తరువాత స్మార్ట్ టీవీలు.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్.. ఒకటేమిటి ఎన్నైనా చూసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. మరికొన్ని రోజుల్లో అన్ని సినిమాలు డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసే ఛాన్సెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాబోయే కాలంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ రాజ్యం కాబట్టి ఇప్పటికే ఆ దిశగా పలువురు అడుగులు వేస్తున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్.. ఇలా చాలా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వచ్చేసాయి. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'ని క్రియేట్ చేశారు. దీంతో శరత్ మరార్, స్వప్న దత్, క్రిష్ లాంటి వారు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేశారు. కాలక్రమేణా వెబ్ కంటెంట్ కి ప్రాధాన్యత పెరగడంతో వీరితోపాటు చాలా మంది బడా నిర్మాతలు ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రీసెంటుగా ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు అడుగులు వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై, సినిమాల డిజిటల్ రిలీజ్ మొదలైన అంశాలపై సురేష్ బాబు స్పందించారట. 'ఇప్పుడు ఓటీటీ స్టార్ ఆలోచన లేదని, ఒకవేళ దాని గురించి ఆలోచించాల్సి వచ్చినా అది ఇప్పుడు కాదని చెప్పాడట. అంతేకాకుండా డిజిటల్ కంటెంట్ మీద మాత్రం ఫోకస్ పెట్టే ఆలోచన మాత్రం ఉందని చెప్పాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లాక్ డౌన్ తర్వాత ప్రకటించనున్నారని సమాచారం.

సినిమాల డిజిటల్ రిలీజ్ పై ఆయన స్పందిస్తూ నిర్మాతలకు ఇబ్బంది లేకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదని.. నిర్మాతకి లాభాలు తెచ్చిపెడతాయి అనుకుంటే అటువైపు అడుగులు వేసినా తప్పులేదని చెప్పాడట. కానీ డిజిటల్ రిలీజ్ అనేది లాంగ్ రన్ కి మేలు చేయదని.. టెంపరరీగా ఆలోచించేది మాత్రమే అని చెప్పాడట. అంతే కాకుండా కరోనా వల్ల నష్టపోయిన రంగాల్లో ఎంటర్టైన్మెంట్ రంగం ఒకటని.. మన సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ పడిందని, కొలుకోవడానికి చాలా టైమ్ పడుతుందని.. అయినా సరే ఇంతటి ముందుకంటే స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పాడట. 
Tags:    

Similar News