ప్రియాంకకు అసహ్యం తెప్పించారుగా..

Update: 2017-05-18 18:54 GMT
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ సంపాదించేసుకుంది. క్వాంటికో టీవీ సిరీస్ తో మొదలు పెట్టి.. ఇప్పుడు హాలీవుడ్ మూవీ బేవాచ్ లో కీలకమైన రోల్ చేసేవరకూ ఎదిగింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పీసీ.. అక్కడ టీవీ షోస్ కు అటెండ్ అవుతూ అలరిస్తోంది.

ఇప్పటివరకూ అనేక టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంకకు తొలిసారిగా అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. అనేక టీవీ షోస్ లో స్పాంటేనియస్ గా సమాధానమిచ్చి అబ్బురపరిచిన ప్రియాంకా చోప్రా.. తొలిసారిగా ఒక ప్రశ్నకు తప్పించుకోవాల్సి వచ్చింది. 'వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్' అనే నైట్ షోకు అటెండ్ అయిన ప్రియాంకకు.. వ్యాఖ్యాత ఆండీ కోహెన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సందర్భంగా ఓ అసహ్యకరమైన ప్రశ్న వేశాడు. ఈ రౌండ్ లో బేవాచ్ యాక్టర్స్ లో డ్వేన్ జాన్సన్.. జాక్ ఎఫ్రాన్ లలో ఎవరో ఒకరిని సమాధానంగా చెప్పాల్సి ఉంటుంది.

వరుసగా ప్రశ్నలు అడుగుతూ మధ్యలో 'ఈ ఇద్దరిలో ఎవరికి పెద్ద d**k ఉంది.. డ్వేన్ జాన్సన్.. జాక్ ఎఫ్రాన్' అంటూ ప్రశ్నించాడు ఆండీ. ఇలాంటి అసహ్యకరమైన ప్రశ్న ఎదురవుతుందని ఊహించని ప్రియాంక.. 'ఇది ప్రశ్నల్లో భాగం కాదు' అంటూ సున్నితంగా సమాధానం చెప్పి తప్పించుకుంది.
Tags:    

Similar News