హీరోను కంపులో కష్టపెడుతున్న కమ్ముల!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ మూవీ 'కుబేర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-06 05:41 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ మూవీ 'కుబేర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు అప్డేట్ రావడంతో మల్టీస్టారర్ పై మరింత బజ్ క్రియేట్ అయింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ రివీల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హీరో ధనుష్ లుక్‌ ను రిలీజ్‌ చేసి మూవీపై అంచనాలు పెంచారు మేకర్స్. చిరిగిన దుస్తుల్లో ధనుష్ ను బిచ్చగాడిలా చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా నాగార్జున లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఆయన బ్లూ కలర్ షర్ట్‌, ఫార్మల్‌ ప్యాంటులో కళ్లజోడు పెట్టుకుని గొడుగుతో వర్షంలో నిలబడి ఆకట్టుకున్నారు.

అయితే.. ఈ సినిమా కోసం తాజాగా ధనుష్ పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా ముంబైలోని ఒక చెత్త కుప్ప పక్కన సుమారు పది గంటల సేపు ధనుష్ గడిపారట. నేచురల్ గా ఎమోషన్స్ పండించడం కోసం కనీసం మాస్కు కూడా ధరించకుండా షూట్ కంప్లీట్ చేశారట. మామూలుగా కాస్త చెత్త ఉంటేనే ఛీ అంటాం. అలాంటిది 10 గంటలపాటు ధనుష్ చెత్త పక్కన నటించడంతో ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వచ్చే ఏడాది చివరలో 'కుబేర' మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టోరీ లీక్ చేశారు శేఖర్ కమ్ముల. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News