పీసీ ఇండియా వ‌స్తోంది ఎందుకంటే...

Update: 2018-03-15 10:07 GMT
ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు చేరిన ఇంపోర్టెడ్ పీస్‌. దాదాపు కొన్నేళ్లుగా ఆమె లాస్ ఏంజ‌ల‌స్‌ నే సొంతూరు చేసేసుకుంది. అక్క‌డ నెల‌ల త‌ర‌బ‌డి నివ‌సిస్తోంది. క్వాంటికో సిరీస్‌ లో ఆమెకు అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇండియాను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసింది. ఇదిగో ఇప్పుడు మ‌ళ్లీ మాతృదేశానికి వ‌స్తోంది.

క్వాంటికోసిరీస్ సూప‌ర్ హిట్ కొట్టింది. అమెరికా ఇండియాలలో ఆ సిరీస్ అభిమానులు ఎక్కువ‌. అందులో ప్రియాంక‌కు న‌టించే అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్ట‌మే. క్వాంటికో ప్రియాంక‌కు అమెరికాలో మంచి గుర్తింపు తెచ్చింది. అందుకే ఆమె కూడా వ‌ద‌ల‌కుండా సిరీస్ ల మీద సిరీస్‌ లు చేసేస్తోంది. మొన్న‌నే మూడో సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇండియాలో ఓ సినిమా చేసేందుకు వ‌స్తోంది. ముంబైలోనే మూడు నెల‌ల పాటూ ఉండి... త‌రువాత మ‌ళ్లీ అమెరికా వెళ్లిపోతుంద‌ట‌. అమ్మ‌డు మామూలు బిజీ కాదు... య‌మ‌బిజీగా ఉంది. ఇంత‌కీ ఏ సినిమాలో న‌టించ‌డానికి ప్రియాంక వ‌స్తోంది?

పీసీ హీరోయిన్‌ గా ఎంపిక‌చేసిన‌ట్టు ఏ బ్యాన‌ర్ వారు ప్ర‌క‌టించ‌లేదు. పీసీ కూడా ఏ సినిమా ఒప్పుకున్న‌దో చెప్ప‌లేదు. మ‌రి ముంబైలో ఉండి ఆమె మూడునెల‌ల పాటూ షూటింగ్ కు వెళ్ల‌బోయే సినిమా ఏది?  తెలిసిన స‌మాచారం ప్ర‌కారం... క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్ లో పీసీ న‌టించ‌నుంద‌ట‌. ఏడాది క్రితం నుంచి దీనిపై టాక్స్ న‌డుస్తున్నాయి. అందులో న‌టించేందుకు పీసీ ఇండియా వ‌స్తోంద‌ట‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

క‌ల్ప‌నా చావ్లా  పంజాబ్ లో పుట్టి ఇక్కడే చ‌దువుకున్న వ్య‌క్తి. ఉన్న‌త చ‌దువుకోసం అమెరికా వెళ్లి అక్క‌డే నాసా శాస్త్ర‌వేత్తగా స్థిర‌ప‌డింది. కొలంబియా వ్యోమ‌నౌక పేలి... 40 ఏళ్ల‌కే మ‌ర‌ణించింది.


Tags:    

Similar News