ఏలియన్స్ నుంచి భూమిని కాపాడే సూపర్ కిడ్స్ స్టోరీ
ఏలియన్స్ భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నితే.. వాటి భారి నుంచి కాపాడేందుకు వీరులైన మానవులు పోరాటం సాగిస్తే... ప్రిడేటర్ అదృశ్య రూపంలో ఉండి ఒంటరి దీవుల్లో మనుషుల్ని సంహరిస్తుంటే దానిని ఎదుర్కొనే ధీశాలి బరిలో దిగితే.. ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఆసక్తికరం. ఆద్యంతం భారీ యాక్షన్ థ్రిల్స్ తో ఆడియెన్ ని కుర్చీ అంచుపై కూచోబెడాయి. ప్రిడేటర్ సిరీస్.. బ్యాటిల్ షిప్.. వంటివి ఈ తరహా కాన్సెప్టులతో ఆద్యంతం రక్తి కట్టించాయి. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఇటీవలి కాలంలో సూపర్ హీరో కాన్సెప్టులతో వచ్చిన సినిమాలన్నీ సంచలన విజయాలు సాధిస్తూ భారీ వసూళ్లతో రికార్డులు తిరిగరాస్తున్నాయి.
ఇక అమెరికన్ టీవీ సిరీస్ లలో ఈ తరహా కథాంశాలు కోకొల్లలు. బాలీవుడ్ అందాల నాయిక ప్రియాంక చోప్రా నటిస్తున్న నెట్ ఫ్లిక్స్ చిత్రం `వి కెన్ బీ హీరోస్` సీక్వెల్ ఈ తరహానే. ఈ సీక్వెల్ ఆద్యంతం భారీ యాక్షన్ థ్రిల్స్ తో రక్తి కట్టించనుంది. అయితే ఇందులో ఏలియన్స్ భూమిపై ఎటాక్ చేయడానికి సిద్ధమైతే వాటిని అంతం చేసేవారిగా చిన్నారులు నటించారు. ప్రియాంక చోప్రా విలన్ పాత్రధారిగా కనిపించారు.
వి కెన్ బీ హీరోస్ లో అమెరికాకు చెందిన ఈవిల్ సీఈవోగా పీసీ నటించింది. మిస్సీ మోరెనో (యాయా గోస్సేలిన్) నేతృత్వంలోని పిడుగుల్లాంటి సూపర్ హీరో కిడ్స్ గ్రహాంతరవాసుల నుండి ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశారన్నది ఆసక్తికరం. పిల్లల హీరోయిక్ విన్యాసాలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయని ఇంతకుముందు రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమైంది. రాబర్ట్ రోడ్రిగెజ్ దర్శకత్వం వహించిన `వి కెన్ బీ హీరోస్` క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కిడ్స్ ని విశేషంగా ఆదరించే స్టఫ్ ఇందులో ఉంది. 44మిలియన్ల కుటుంబాలు ఈ సిరీస్ ని ఆదరిస్తున్నారని పీసీ ఇంతకుముందు వెల్లడించింది.
పీసీ తదుపరి `టెక్స్ట్ ఫర్ యు` షూటింగ్ కోసం లండన్ లో ఉన్న సంగతి తెలిసినదే. తనతో పాటే భర్త నిక్ జోనాస్ లండన్ లోనే షూటింగులో పాల్గొంటున్నారు.