• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెకండ్ ఇన్నింగ్స్ లో...

సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న జాతీయ ఉత్తమ నటి..!

By - Tupaki Desk
Update: 2020-04-26 23:30 GMT
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కెరీర్ తొలినాళ్లలో పెద్దగా సక్సెస్ దక్కక ఇండస్ట్రీకి దూరమైనా.. రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వారు చాలామందే ఉన్నారు. వారిలో ప్రియమణి ఒకరు. మన సౌత్ నుండి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రియమణి ఒకరు. 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియమణి స్టార్ హీరోలందరి సరసన నటించింది. నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్, గోపీచంద్, జగపతిబాబు, నితిన్ లాంటి హీరోలందరితో యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించింది. టాలీవుడ్ లో చివరగా 'మనవూరి రామాయణం'లో కనిపించిన ప్రియమణి ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అయితే పెళ్లి తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. వరుస అవకాశాలతో అదరగొడుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రియమణి బాలీవుడ్ లో తాజాగా 'అతీత్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. లేటెస్టుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ లో నేరుగా రిలీజైన 'అతీత్' ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌ లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతోంది.

అజయ్ దేవగణ్ సరసన ‘మైదాన్‌’లో నటిస్తున్న ప్రియమణి.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సిరీస్‌ లో కూడా యాక్ట్ చేస్తోంది. ఇక తెలుగులోనూ వెంకటేశ్‌ ‘నారప్ప’ సినిమాలో నటిస్తోంది ప్రియమణి. అంతేకాకుండా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'విరాటపర్వం' లోను కీలక పాత్రలో నటిస్తోంది. ఇన్ని రోజులు టాలీవుడ్ కి దూరమైనా ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులకు టచ్‌ లోనే ఉంటోంది. అంతేకాకుండా కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తోంది. అందరు హీరోయిన్లు పెళ్లైన తర్వాత అవకాశాలు కోల్పోతుంటే.. ప్రియమణి మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత బిజీ అయ్యింది. ప్రియమణి దూకుడు చూస్తుంటే కొత్త హీరోయిన్స్ కి కూడా పోటీగా మారేలా ఉందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టయితే ప్రియమణి సీనియర్ హీరోలకు ఏకైక ఛాయిస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్లు దొరకడం చాలా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న ప్రియమణి వైపు అందరూ మొగ్గుచూపే అవకాశం ఉంది. 
Tags:    
  • Priyamani 
  • Film Industry 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS