పవన్‌ 'బ్రో' షూ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Update: 2023-05-30 10:34 GMT
పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో 'బ్రో' సినిమా ఒకటి. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఫుల్ స్వింగ్‌ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్ 'బ్రో' లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. ఆ తర్వాత సాయి ధరమ్‌ తేజ్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయాన్ని రివీల్‌ చేయడం జరిగింది. తాజాగా పవన్‌ కళ్యాణ్ మరియు సాయి ధరమ్‌ తేజ్ కలిసి ఉన్న 'బ్రో' పోస్టర్ ను రివీల్‌ చేయడం జరిగింది. తాజా పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ గురించి చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా బ్రో కోసం ఆసక్తిగా ఎదురు చూసే విధంగా ఈ పోస్టర్‌ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తాజా పోస్టర్ లో పవన్‌ కళ్యాణ్ ధరించిన షూస్ గురించి చర్చ జరుగుతోంది. ఆ షూస్‌ ఖరీదు లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది అంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.

కొందరు ఔత్సాహికులు నెట్‌ లో పవన్ కళ్యాణ్‌ ధరించిన షూస్ యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో తెలిసిన విషయం ఏంటి అంటే ఆ షూస్‌ బాల్ మెయిన్ యూనికర్న్‌ కంపెనీ షూస్ గా తెలిసింది. అంతే కాకుండా 82 శాతం నైలాన్ మరియు 14 శాతం ఎలస్టాన్‌ ఇంకా 4 శాతం థెర్మో ప్లాస్టిక్‌ పాలీయూరెథాన్ మెటీరియల్‌ ను షూస్‌ కోసం ఉపయోగించబడ్డాయట.

బ్లాక్ నేయిర్‌ కలర్‌ తో చేయబడ్డ ఈ షూస్‌ యొక్క ఖరీదు 1207 పౌండ్లు అని ఇంటర్నెట్ లో చూపిస్తోంది. ఇండియన్ కరెన్సీ లో రూ.1,06,870 గా కంపెనీ పేర్కొనడం జరిగింది. ఇండియాలో ఈ షూస్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రత్యేక ఆర్డర్‌ లపై ఇండియన్స్ ఈ షూస్ ధరించే అవకాశాలు ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ చాలా సింప్లిసిటీగా ఉంటారు అని అంతా అంటారు. మరి షూస్ లక్ష రూపాయలు ఏంటి బ్రో అంటూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ నుంచి సమాధానం ఏంటో చూడాలి.

Similar News