• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: 'ప్రేమంటే ఏంటి'...

వీడియో: 'ప్రేమంటే ఏంటి' గీతంతో పాటల సందడి షురూ చేసిన 'పెళ్లి సందD'

By - Tupaki Desk
Update: 2021-04-28 07:01 GMT
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ 'పెళ్లిసందడి' తరహాలో ''పెళ్లి సందD'' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. తెలుగమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని తాజాగా విడుదల చేసారు. రాఘవేంద్రరావు కి ఏప్రిల్ 28వ తేదీతో ఉన్న సెంటిమెంట్ తో ఈరోజు 'ప్రేమంటే ఏంటి' అని సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

'నువ్వంటే నాకు ధైర్యం.. నేనంటే నీకు సర్వం.. నీకూ నాకు ప్రేమ.. ప్రేమంటే ఏంటి' అంటూ సాగిన ఈ సోల్ ఫుల్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. కీరవాణి అందించిన బాణీలకు లిరిసిస్ట్ చంద్రబోస్ అందమైన పదాలను సాహిత్యంగా అందించారు. ఈ పాటను హరిచరణ్ - శ్వేతా పండిట్ కలిసి ఆలపించారు. ఈ సాంగ్ లో హీరోహీరోయిన్లు ముద్దుపెట్టుకోడానికి ట్రై చేస్తుండగా.. వారి మధ్యలో ఉన్న బెలూన్ పగిలిపోవడం వంటివి దర్శకేంద్రుడి గత చిత్రాల పిక్చరైజేషన్ ను గుర్తు చేస్తున్నాయి. 'ప్రేమంటే ఏంటి' పాటను అందమైన మంచు లొకేషన్స్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సునీల్ కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందించగా.. త‌మ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.

రాఘవేంద్రరావు - కీరవాణి - చంద్రబోస్ కలిసి మ్యాజిక్ రిపీట్ చేసారని 'ప్రేమంటే ఏంటి' పాట వింటే అర్థం అవుతోంది. అప్పుడు 'పెళ్లి సందడి' మాదిరిగానే ఇప్పుడు 'పెళ్లి సందD' సినిమాతో మ్మరోసారి పాటల సందడి మొదలైందని చెప్పవచ్చు. ఈ రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ని కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో ఆర్‌.కె. ఫిలిం అసోసియేట్స్‌ - ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Full View
Tags:    
  • Pelli Sandadi 
  • Premante Enti Lyrical Song 
  • Roshan 
  • Srikanth 
  • Tollywood 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS