• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమ‌మ్‌ కోసం నార్వేకి ...

ప్రేమ‌మ్‌ కోసం నార్వేకి చైతూ

By - Tupaki Desk
Update: 2016-06-28 07:13 GMT
నాగ‌చైత‌న్య న‌టించిన రెండు సినిమాలూ చివ‌రి ద‌శ‌కు చేరుకొన్నాయి. సాహ‌సం శ్వాస‌గా సాగిపో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రేమ‌మ్‌ ని ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌బోతున్నారు. మిగిలి వున్న `సాహ‌సం..` షూటింగ్‌ ని  వీలైనంత త్వ‌ర‌గా ఫినిష్ చేసి ఫ్లైటెక్కాల‌ని నాగ‌చైత‌న్య డిసైడ‌య్యాడు. జులై 12న నార్వేకి వెళ్ల‌బోతున్నాడాయ‌న‌. 14 నుంచి అక్క‌డ ప్రేమ‌మ్‌ కి సంబంధించిన రెండు పాట‌ల్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.  ఆ పాట‌ల చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిపోతుంది. ఆగ‌స్టు 7న పాట‌ల్ని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత రెండు వారాల‌కి సినిమాని విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ప్రేమ‌మ్‌ కి రీమేక్‌ గా రూపొందుతున్న చిత్ర‌మే ప్రేమమ్‌.

నాగ‌చైత‌న్య - శ్రుతిహాస‌న్‌ లు  ఎంతో ముచ్చ‌ట‌ప‌డి  ఈ సినిమాని చేశారు. ద‌ర్శ‌కుడు చందు మొండేటికి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే అంతా మ‌న‌సు పెట్టి ఈసినిమాకి ప‌నిచేశారు.  ఇప్ప‌టికే టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడు చందు. అంద‌మైన రెండు పాట‌ల్ని తెర‌కెక్కించేందుకు నార్వేకి వెళ్ల‌బోతున్నారు. సినిమాకి కీల‌క‌మైన ఆ పాట‌ల్ని తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు కొన్ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాడ‌ని స‌మాచారం. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్‌ - అనుప‌మ‌ - మ‌డోన్నా న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌ - శ్రుతిహాస‌న్‌ ల‌పైనే నార్వేలో పాట‌ల్ని తెర‌కెక్కించ‌బోతున్నార‌ని స‌మాచారం.
Tags:    
  • Naga Chaitanya 
  • Premam Movie 
  • Telugu NEWs 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS