డ్ర‌గ్స్ కేసుపై ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Update: 2021-09-04 06:32 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ డొంక‌పై ఈడీ కొర‌డా ఝ‌లిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ సేవించేవాళ్లు క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిపిన‌వాళ్ల‌పై ఈడీ విచార‌ణ సీరియ‌స్ గా సాగుతోంది. విదేశీ డ్ర‌గ్ పెడ్ల‌ర్ల‌తో సత్సంబంధాలు క‌లిగి ఉన్న టాప్ సెల‌బ్రిటీలంద‌రినీ ఈడీ సుదీర్ఘ స‌మ‌యం విచార‌ణ సాగిస్తోంది. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్.. హీరోయిన్ కం నిర్మాత‌ ఛార్మి... అందాల క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్.. ల‌ను ఇప్ప‌టికే ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్) విచారించింది.

సుదీర్ఘ విచార‌ణ‌లో త‌మ ఆడిట‌ర్ల‌తో త‌మ ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన వివరాల్ని స‌ద‌రు సెలబ్రిటీలు ఈడీకి అందించార‌ని తెలుస్తోంది. డ్ర‌గ్ పెడ్ల‌ర్ల‌తో ఆర్థిక లావాదేవీలు.. మ‌నీ ల్యాండ‌రింగ్ వంటి అంశాలు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. సెల‌బ్రిటీల ద్వారా స్వ‌దేశీ క‌రెన్సీ విదేశాలకు ఎలా త‌ర‌లి వెళ్లింది?  ఎంత మొత్తం త‌ర‌లి వెళ్లింది? అనే దానిపై సీరియ‌స్ గా విచార‌ణ సాగుతోంది. నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు డొంక‌ను క‌దిల్చి ఈడీ విచారిస్తుంటే ఏం జ‌రుగుతోందో అర్థం కాని పరిస్థితి క‌నిపిస్తోంది. ఇక సెలబ్రిటీల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డ‌మే గాక‌.. తీగ ప‌ట్టుకుని డొంకంతా క‌దిల్చేందుకే ఇంత సుదీర్ఘ స‌మ‌యం అధికారులు తీసుకున్నార‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. ఇక డ్ర‌గ్స్ డొంక‌లో రాజ‌కీయ నాయ‌కుల వ్య‌వ‌హారంపైనా స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. ఇందులో తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారా? అనే కోణంలో కూడా ఈ విచార‌ణలో ప్ర‌శ్న‌లు ఎదురైన‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో `మా` ఎన్నిక‌లు స‌మీపించాయి. ఈ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డ్ర‌గ్స్ పుచ్చుకునేవాళ్లు లేదా విక్ర‌యించేవాళ్లు దేశ‌ద్రోహుల‌ని అన్నారు. యువ‌త‌ను చెడు మార్గం ప‌ట్టించ‌డ‌మే గాక మ‌న డ‌బ్బు విదేశాల‌కు త‌ర‌లి వెళుతుంద‌ని దీనిని తాను తీవ్రంగా త‌ప్పు ప‌డ‌తాన‌ని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నాకు అలాంటి విషయాలు పడవు. మన యువతరాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా? డ్రగ్స్ కేసు ఆరోప‌ణ‌ల ఆధారంగా విచారిస్తున్నారు.  రుజువు అయితే తప్పకుండా నేనే చర్యలు తీసుకొంటాను అని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు.  డ్రగ్స్ వాడకాన్ని ఎవరూ ఉపేక్షించకూడద‌ని.. భావితరాల అభివృద్దికి నిరోధ‌క‌మ‌ని.. ఆరోగ్యానికి సమాజానికి అడ్డంకిగా ప్ర‌తిదీ మారుతోంద‌ని ఆయ‌న అన్నారు. డ్ర‌గ్స్ వాడేది ఎవ‌రైనా తాను తప్పు ప‌డ‌తాన‌ని అన్నారు.

మా ఎన్నికల్లో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ఇదీ

మా ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి నువ్వా నేనా అంటూ ఐదుగురు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ .. మంచు విష్ణు ప్యానెల్ మ‌ధ్య‌నే అస‌లైన పోటీ నెల‌కొంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. మాటా మాటా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వార్ లో జీవిత రాజ‌శేఖ‌ర్.. న‌టి హేమ ఇరువురూ ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేస్తుండ‌డం తాజా ట్విస్టు. ఇక వీకే న‌రేష్ అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌రోసారి పోటీప‌డనున్నారు. ఇంత‌లోనే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ని మ‌రోసారి స్ప‌ష్ఠంగా మీడియాకు ప్ర‌క‌టించారు. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీప‌డుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోటీలో శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీకాంత్ నిల‌వగా.. నటి హేమ.. బెనర్జీ లు ఉపాధ్య‌క్ష పోటీబ‌రిలో ఉన్నారు. జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ గా పోటీప‌డుతుండ‌గా.. ఉత్తేజ్ - అనిత చౌదరి జాయింట్ సెక్రటరీ లు గా బ‌రిలో దిగుతున్నారు. ట్రెజరర్ గా నటుడు నాగినీడు పోటీప‌డుతున్నారు.

ఈసీ స‌భ్యులుగా 18 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అనసూయ- అజయ్- భూపాల్- బ్రహ్మాజీ- ఈటివి ప్రభాకర్- గోవిందరావు- ఖయ్యుం- కౌశిక్- ప్రగతి- రమణ రెడ్డి- శ్రీధర్ రావు- శివ రెడ్డి- సమీర్- సుడిగాలి సుధీర్- సుబ్బరాజు. డి- సురేష్ కొండేటి- తనీష్- టార్జాన్ లు ఉన్నారు. ఈ సీజ‌న్ ఎన్నిక‌ల్లో ర‌గ‌డ కాస్త పీక్స్ లో నే ఉండ‌నుంద‌ని స‌న్నివేశం చెబుతోంది. ఒక‌సారి ప్యానెల్ ప్ర‌క‌టించాక‌.. మ‌రోసారి ప్ర‌క‌టించి ప్ర‌కాష్ రాజ్ రేసుగుర్రంలా ముందుకు ఉరుకుతున్నారు.

ప్ర‌కాష్ రాజ్.. విష్ణు.. వీకే న‌రేష్ ఎవ‌రికి వారు పోటీబ‌రిలో ఉన్నారు. వీరితో పాటు సీవీఎల్ తెలంగాణ క‌ళాకారుల త‌ర‌పున పోటీకి దిగుతున్నారు. మా అసోసియేష‌న్ భ‌వంతి నిర్మాణ‌మే ఎజెండాగా మంచు విష్ణు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయ‌న డ‌బ్బు పెట్ట‌డ‌మే గాక‌.. మూడు స్థలాల్ని వెతికాన‌ని ప్ర‌క‌టించి వేడి పెంచారు. ఇక తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున మా అసోసియేష‌న్ కి స్థ‌లం కోర‌తాన‌ని ప్ర‌కాష్ రాజ్ అంటున్నారు. మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఈసారి ప్ర‌కాష్ రాజ్ గెలుపు ఖాయం అని ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తుంటే.. మ‌రోవర్గం కృష్ణంరాజు- బాల‌కృష్ణ అండ‌దండ‌ల‌తో విష్ణు బాబు గెలుస్తాడ‌ని ప్ర‌చారం చేస్తోంది. ఎన్నిక‌ల వార్ ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. త‌దుప‌రి ఇత‌రులు త‌మ ప్యానెళ్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News