విల‌క్ష‌ణ న‌టుడితో మెగా డాట‌ర్ బిగ్ డీల్

Update: 2020-07-10 04:59 GMT
మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొత్త జాబ్ గురించి తెలిసిందే. ఆమె నిర్మాత‌గా మారి వెబ్ సిరీస్ లు.. సినిమాల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భర్త విష్ణు తో క‌లిసి సొంతంగా `గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ ‌మెంట్స్` పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ తొలిగా వెబ్ సిరీస్ ని నిర్మించ‌నుంది. ఇటీవ‌లే క్లాప్ కొట్టి లాంఛ‌నంగా సిరీస్ ని ప్రారంభించారు.

ఈ వెబ్ సిరీస్ గురించి వాక‌బు చేస్తే చాలా ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. ఈ సిరీస్ కి సిద్ధార్థ్ - షామిలీ జంట‌గా న‌టించిన‌ ఓయ్ (2009) మూవీకి దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా దర్శకత్వం వహించనున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత అత‌డికి ఇది స‌ద‌వ‌కాశం అనే చెప్పాలి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సిరీస్ ‌ఇది యాక్షన్ ప్యాక్డ్ కాప్-డ్రామా. విల‌క్ష‌ణ నటుడు.. మెగా ఫ్యామిలీ స‌న్నిహితుడు అయిన‌ ప్రకాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా.. మ‌రో సీనియ‌ర్ సంపత్ రాజ్ ఇతర ప్రధాన పాత్ర‌లో క‌నిపిస్తారు. జీ 5లో ఇది ప్రసారం అవుతుంది. `ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్` అనే ఉప‌శీర్షిక‌ను నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

ఇది ఓ సీరియ‌స్ పోలీస్ డ్రామా .. నేర‌ పరిశోధనలు.. వ‌రుస‌ నేరాలు.. కొన్ని మలుపులతో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుందిట‌. మెగా డాట‌ర్ సుస్మిత నిర్మాత‌గా రాణించాల‌నే త‌హ‌త‌హ‌లో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఈ బ్యాన‌ర్ అధినేత్రి ఆరంభ‌మే ఆస‌క్తిక‌ర‌మైన అడుగులు వేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్ లాంటి సీనియ‌ర్ తో వెబ్ మూవీ కం సిరీస్ ప్లాన్ చేశారు కాబ‌ట్టి వైర‌ల్ గా చ‌ర్చ సాగ‌డం ఖాయం.
Tags:    

Similar News