రాధే శ్యామ్ షూట్ గ్యాప్ లో .. ఇటలీ వీధుల్లో ఫ్యానిజం!

Update: 2020-11-06 09:50 GMT
డార్లింగ్ ప్రభాస్ న‌టిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే క‌థానాయిక‌. జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం  ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసి హైద‌రాబాద్ కి బ‌య‌ల్దేరే హ‌డావుడిలో ఉన్నార‌ట ప్ర‌భాస్. ఇటలీలో బిజీ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిగో వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా అలా షికార్ కి వెళుతున్నారు ప్ర‌భాస్. టురిన్ నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరుగేస్తున్న‌ప్పుడు ఓ అభిమానితో ఇలా ఫోజిచ్చారు ప్ర‌భాస్.

డార్లింగ్ జాగింగ్ ట్రాక్ లో క‌నిపిస్తున్నారు. పైన ఖ‌రీదైన జాకెట్ ధ‌రించారు. పైగా మాస్క్ ధరించి థంబ్స్ అప్ ఫోజిచ్చారిలా. తన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తున్నార‌న‌డానికి ఈ ఫోటోనే సాక్ష్యం. వచ్చే వారం ప్రభాస్ హైదరాబాద్ కి తిరిగి వస్తారని తెలుస్తోంది.

రాధే శ్యామ్ పెండింగ్ చిత్రీకరణను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభిస్తారట‌. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ కోసం నగరంలో భారీ సెట్లు రెడీ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ సుదీర్ఘమైనది. భారీగా క్రేజీ స‌న్నివేశాల‌ షూటింగ్ జరుగుతుంది. ‘రాధే శ్యామ్’లో రిద్ధి కుమార్.. భాగ్యశ్రీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News