• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న‌తో...

ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న‌తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్

By - Tupaki Desk
Update: 2020-08-18 03:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస‌గా షాక్ ల‌ మీద షాక్ లిస్తున్నాడు. మొన్న‌టికి మొన్న నాగ్ అశ్విన్-అశ్వ‌నిద‌త్ బృందంతో క‌లిసి ప్ర‌భాస్ 21 ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌గానే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. నిప్పు పొగ‌ లేకుండానే.. ఇంత స్పీడ్ చూపించాడు! అంటూ ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్ర‌భాస్ 21లో క‌థానాయిక‌గా దీపిక ప‌దుకొనేని ఎంపిక చేసి ఆ వెంట‌నే మ‌రో షాకిచ్చారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో మునుపెన్న‌డూ చూడ‌ని విజువ‌ల్ ఫీస్ట్ ని తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తాజాగా మ‌రో ఊహించ‌ని షాక్. గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ డార్లింగ్ ప్ర‌భాస్ తో ఓ సినిమాని చేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఎట్ట‌కేల‌కు అది కాస్తా అధికారికంగా క‌న్ఫామ్ అయ్యింది. ప్ర‌భాస్ 22 వ చిత్రాన్ని ఓంరౌత్ తెర‌కెక్కిస్తారు. దీనిపై తాజా ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు. `A- ఆదిపురుష్` పేరుతో భారతదేశంలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత‌ అత్యంత భారీగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. A అనే సింగిల్ లెట‌ర్ టైటిల్ అంత‌ర్జాతీయ రిలీజ్ ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఆదిపురుష్ క‌థాంశం `రామాయణం` ఇతిహాసంపై ఆధారపడిన‌ది. ప్రభాస్ అందులో రాముడి పాత్రను పోషించనున్నారు. 3 డి ఫార్మాట్ ‌లో .. హైఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ఫీస్ట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.  ఈ ప్రాజెక్ట్ 2021 లో సెట్స్ పైకి వెళ్లి.. 2022 లో విడుద‌ల‌వుతుంది ప్రధాన విల‌న్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ న‌టుల‌ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఈ చిత్రం హిందీ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్క‌నుంది. అంతర్జాతీయంగా విడుదల కోసం అనేక విదేశీ భాషల్లోకి అనువ‌దించ‌నున్నారు. దీంతో పాటు తమిళం..మలయాళం .. కన్నడ భాషలలో కూడా అనువ‌దించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థ సహకారంతో టీ-సిరీస్ కు చెందిన భూషణ్ కుమార్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దాదాపు 500కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చించ‌నున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    
  • Prabhas 
  • Adipurush 
  • Pan India Film 
  • TElugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS