ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ కు మరింతగా మెరుగులు
ప్రభాస్ రాధే శ్యామ్ పూర్తి చేసిన వెంటనే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని అనూహ్యంగా బాలీవుడ్ నుండి వచ్చిన ఆదిపురుష్ ను మొదట చేయాలని ప్రభాస్ అనుకున్నాడు. సరే ఆదిపురుష్ తర్వాత అయినా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుందనుకుంటే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ను షురూ చేశాడు. రాధేశ్యామ్ అలా ఉండగానే ఆదిపురుష్ మరియు సలార్ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. మరో వైపు నాగ్ అశ్విన్ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు.
ఈ ఏడాది జూన్ లేదా జులై కి నాగ్ అశ్విన్ మూవీని పట్టాలెక్కించాలని ప్రభాస్ భావించినా కూడా కరోనా కారణంగా అది సాధ్యం కావడం లేదు. రాధే శ్యామ్ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు... ఆదిపురుష్ మరియు సలార్ సినిమా షూటింగ్ లు మొదలు పెట్టాడు కనుక వాటిని ముగింపు దశకు తీసుకు వెళ్లే వరకు కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ మొదలు పెట్టలేని పరిస్థితి. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేస్తే రాధే శ్యామ్ ఇప్పటికే పూర్తి అయ్యేది.. సలార్ మరియు ఆదిపురుష్ షూటింగ్ లు జులై ఆగస్టు వరకు దాదాపుగా ముగింపు దశకు వచ్చేవి. కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల మూడు సినిమాలు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దాంతో నాగ్ అశ్విన్ సినిమా మరింత ఆలస్యం అవుతుంది.
సినిమా ఆలస్యం అవుతుందని జుట్టు పీక్కోకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రశాంతంగా స్క్రిప్ట్ కు మరింతగా హంగులు అద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కోసం ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీకి పదును పెడుతున్నాడు. మహానటి సినిమా కోసం కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ సుదీర్ఘ కాలం స్క్రిప్ట్ వర్క్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ప్రభాస్ సినిమా కు కూడా ఎక్కువ రోజులు స్క్రిప్ట్ వర్క్ చేస్తే తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. 2023లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.