ప్రభాస్ నాల్గవ సినిమా ఈ ఏడాది లేనట్లే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. రాధే శ్యామ్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. రెండు మూడు వారాల షూటింగ్ తో రాధే శ్యామ్ పూర్తి అవ్వబోతుందట. ఇక సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు ఈమద్యే షూటింగ్ జరుపుకున్నాయి. ఒక్కో షెడ్యూల్ చొప్పున పూర్తి చేసుకుంది. ఈ మూడు సినిమాలు అనుకున్నది అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగి ఉంటే జూన్ లేదా జులై నెలల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ మొదలు పెట్టేవాడు. కాని కరోనా మొదటి వేవ్ మరియు సెకండ్ వేవ్ వల్ల ప్రభాస్ సినిమాల షూటింగ్ లు అనుకున్నట్లుగా సాగడం లేదు.
ఇటీవలే ప్రభాస్.. నాగ్ అశ్విన్ ల మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రభాస్ కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో పాటు మళ్లీ మూడవ వేవ్ గురించి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టడం అసాధ్యంగా ప్రభాస్ భావిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాదికి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి.
నాగ్ అశ్విన్ మహానటి తర్వాత చేయబోతున్న సినిమా ఇదే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అమితాబచ్చన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఈ సినిమాలో నటించబోతుంది. దాంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అనుకున్న సమయంకు సినిమా ప్రారంభం అయ్యి ఉంటే 2022 లో విడుదల అయ్యేది. కాని ఇప్పుడు విడుదల మరో ఏడాది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాలవారంటున్నారు.