#ప్రభాస్ డైలమా! ఆదిపురుష్ తర్వాతే ఇంకేదైనా?
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా (వరల్డ్) సినిమాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ పూర్తి కాగానే..రెండు భారీ బడ్జెట్ చిత్రాలు చేసేందుకు పక్కా ప్రణాళికలతో సంసిద్ధంగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రకటించిన కొద్దిరోజులకే ఓం రౌత్ తో ఆదిపురుష్ 3డి ని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు? ఏది వెనక? అన్నదానిపై ఇప్పటికీ అభిమానుల్లో కన్ఫ్యూజన్ అలానే ఉంది. ఇంతకీ డార్లింగ్ ప్రభాస్ కి అయినా దీనిపై పూర్తి క్లారిటీ ఉందా? ఇంకా ఏదైనా డైలమా కొనసాగుతోందా? అంటే.. ప్రభాస్ మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నారని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది.
నాగ్ అశ్విన్ సినిమాని ముందే ప్రకటించినా ప్రీప్రొడక్షన్ కే ఎక్కువ సమయం పడుతుందట. అందువల్ల ఆదిపురుష్ 3డి ని తొలిగా ప్రారంభించేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాని ప్రారంభించే వీలుందని తెలుస్తోంది. నిజానికి ఈ రెండిటినీ ప్యారలల్ గా చిత్రీకరిస్తారని కథనాలొచ్చినా అవన్నీ అవాస్తవాలు అని మరోమారు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓం రౌత్ తో ఆదిపురుష్ ని శరవేగంగా పూర్తి చేసి నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తానని ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయిట. మొత్తానికి ప్రభాస్ పూర్తి క్లారిటీతో ఉన్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాకి భారీ టెక్నాలజీ అవసరం ఉంది. అలాగే పురాణేతిహాసాల ఆధారంగా రూపొందిస్తున్న ఆదిపురుష్ కి సాంకేతికత పరంగా హై వ్యాల్యూస్ అవసరం అని తెలుస్తోంది. కాబట్టి ఈ రెండిటి విషయంలో ప్రభాస్ ఎక్కడా రాజీకి రాకుండా ప్లాన్ చేస్తున్నారట. సేమ్ టైమ్ ఇద్దరు దర్శకుల్ని కన్విన్స్ చేసి ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.