ప్రభాస్‌ 21 కోసం ఆమెనే కన్ఫర్మ్‌ చేశారా?

Update: 2020-04-25 07:10 GMT
ప్రస్తుతం ప్రభాస్‌ స్థాయి కేవలం టాలీవుడ్‌ కే పరిమితం కాదు. ఆయన ఒక పాన్‌ ఇండియా స్టార్‌. అందుకే ఆయనతో సినిమా అంటే ఏ దర్శకుడు అయినా.. నిర్మాత అయినా భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ యూవీ క్రియేషన్స్‌ లో రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపుగా సగానికి పైగా పూర్తి అయ్యింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రభాస్‌ 21వ చిత్రంగా రూపొందబోతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకం గా నిర్మించబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. మహానటి చిత్రంతో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మరో అద్బుతంను ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో రెండేళ్ల సమయం తీసుకున్నాడు. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతున్న ప్రభాస్‌ 21 చిత్రం హీరోయిన్‌ గా కియారా అద్వానీ ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పలు దఫాలుగా ఆమెతో ఫోన్‌ లో యూనిట్‌ సభ్యులు చర్చించారట. డేట్ల విషయంలో ఇంకా ఏ క్లారిటీ ఇవ్వని కియారా అద్వానీ ఈ సినిమాలో నటించేందుకు మాత్రం ఓకే చెప్పింది. ప్రభాస్‌ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ కనుక ఆయనతో ఖచ్చితంగా నటించాలని ఆమె భావిస్తుందట. లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. ఈమె తెలుగులో ఇప్పటికే భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. సౌత్‌ తో పాటు ఉత్తరాదిన ఈమెకున్న క్రేజ్‌ నేపథ్యంలో ఈమె ప్రభాస్‌ 21కు ఖచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News