ఏం జరుగుతోంది డార్లింగ్ ?

Update: 2018-09-22 06:14 GMT
ప్రభాస్ సినిమా కాబట్టి దర్శక నిర్మాతలు అవసరానికి మించిన బడ్జెట్ తో పాటు ఆలస్యాన్ని అలవాటు చేసుకుంటున్నారా లేక టైం కలిసిరాక అనుకున్నవి పూర్తి కావడం లేదా అనే అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాహుబలి రెండు భాగాల కోసం కెరీర్ లో ఐదేళ్ల విలువైన కాలాన్ని త్యాగం చేసిన ప్రభాస్ దానికి తగ్గ ఫలితాన్నే అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా కూడా రెగ్యులర్ గా తమ హీరో తెరపైకి రాకపోవడాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సరే అదీ మంచికేగా అని సర్దుకుని సాహో అయినా త్వరగా వస్తుందిలే అనుకుంటే ఎదురుచూపులు ఎంతకీ తీరడం లేదు. పైపెచ్చు విడుదల విషయంలో కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ సైతం మౌనాన్నే ఆశ్రయిస్తున్నాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన సాహో  టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. త్వరలో మరో చిన్న షెడ్యూల్ కోసం ముంబై వెళ్ళబోతున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం సాహో స్క్రిప్ట్ కి కొన్ని రిపేర్లు జరుగుతున్నాయట. రషెస్ చూసిన ప్రభాస్ అందులో కొంత భాగం అంత సంతృప్తికరంగా అనిపించకపోవడంతో దర్శకుడు సుజిత్ కు ఆ మేరకు మార్పులు చేర్పులు చేయమని చెప్పాడట. దీంతో మళ్ళి రాతల పని మొదలైందని సమాచారం. వచ్చే ఐదో షెడ్యూల్ లో ఈ మార్చిన సీన్లు తీయొచ్చని టాక్. రన్ రాజా రాజా తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్న సుజిత్ ఇప్పుడు కూడా మార్పులు చేయించేలా సలహాలు తీసుకుంటున్నాడు అంటే ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.ఏడాది  క్రితమే ఫస్ట్ లుక్ వదిలిన సాహో టీమ్ మరో నెల రోజుల్లో ఇంకో బర్త్ డే వస్తున్నా కనీసం టీజర్ కూడా రెడీ చేయలేదు. ఇదే అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న విషయం. ఒకవైపు మహర్షి-సైరా లాంటి క్రేజీ ప్రాజెక్టులు వేసవి సీజన్ కోసం పోటీ పడి షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఉంటే సాహో టీమ్  సైలెన్స్ ని భరించడం ఫ్యాన్స్ వల్ల కావడం లేదు. మొన్న రాధాకృష్ణ దర్శకత్వంలో ఇంకో సినిమా మొదలుపెట్టారు కానీ అది కూడా యువి సంస్థ భాగస్వామ్యంలోనే కాబట్టి దానికి సంబందించిన పక్కా సమాచారం కూడా ఇప్పుడే తెలియకపోవచ్చు. ఈ అయోమయం అంతా తీరేలా సాహో టీమ్ ఒక ప్రెస్ మీట్ పెడితే బెటర్.
Tags:    

Similar News