ప్ర‌భాస్ సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ లాంచ్ డేట్

Update: 2022-05-08 12:58 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ హాట్ టాపిక్ గా మారాడు. సాహో- రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ ల‌ త‌ర్వాతా అత‌డి ప‌య‌నం అసాధార‌ణంగా క‌నిపిస్తోంది. వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తూ పాన్ ఇండియా మార్కెట్ల‌లో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్- ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. మ‌రోవైపు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇంత‌లోనే యువ‌ద‌ర్శ‌కుడు మారుతితో ప్ర‌భాస్ `రాజా డీల‌క్స్` ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఇప్ప‌టికే మారుతి స్క్రిప్ట్ ని లాక్ చేసారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారని సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. అక్కడ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేయ‌నున్నారు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ని ఇంత‌కుముందు టాక్ వినిపించింది.

తాజా స‌మాచారం మేర‌కు `రాజా డీల‌క్స్` చిత్రం ఆగ‌స్టులో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న మాళ‌విక మోహ‌న‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇది సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ అని కూడా స‌మాచారం లీకైంది. ప్ర‌భాస్ ఇప్ప‌టివ‌ర‌కూ న‌టించిన జాన‌ర్ ల‌కు భిన్నంగా మారుతి కొత్త జానర్ ని ఎంచుకున్నారు. ఈ త‌ర‌హా కాన్సెప్ట్ లో ఒక పాన్ ఇండియా స్టార్ ని ఎలా చూపిస్తారు? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

2004లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మారుతీ దాసరి ఇప్ప‌టి వ‌ర‌కూ అగ్ర హీరోల‌తో ప‌ని చేయ‌లేదు. న‌వ‌త‌రం స్టార్ల‌తో అత‌డు చ‌క్క‌ని విజ‌యాలు ద‌క్కించుకున్నాడు. ఈ రోజుల్లో-బస్టాప్-ప్రేమ కథా చిత్రమ్-కొత్త జంట-భలే భలే మగాడివోయ్-బాబు బంగారం వంటి మంచి హిట్స్ అందించారు. మహానుభావుడు లాంటి సెటైరిక‌ల్ కామెడీని కూడా మారుతి  తెర‌కెక్కించారు.

అందుకే తాజా చిత్రంలో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ తో అత‌డి ప‌నితీరు ఎలా ఉంటుందోన‌ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌భాస్ ఇందులో ఒక విలక్షణమైన పాత్రను చేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో క‌థానాయిక‌లుగా మాళవిక మోహనన్ - కృతి శెట్టి- శ్రీ లీల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేవ‌లం రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.
Tags:    

Similar News