ప్రభాస్‌ రాజాడీలక్స్ ఆ వార్త నిజం కావద్దంటున్న ఫ్యాన్స్‌

Update: 2022-04-18 15:30 GMT
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు.. ఏళ్లకు ఏళ్లు మేకింగ్ జరగాల్సిన సినిమాలు. ఇన్ని భారీ సినిమాల మద్యలో మారుతి దర్శకత్వంలో ఒక జెట్ స్పీడ్‌ సినిమాను ప్రభాస్ చేయబోతన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన ఈ సినిమా కొన్ని కారణాల వాయిదా పడుతుంది కాని.. మొదలు అవ్వడం మాత్రం పక్కా అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

దానయ్య నిర్మించబోతున్న రాజా డీలన్స్ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ విషయాలు గత కొన్ని నెలలుగా మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాజా డీలక్స్‌ సినిమా ను మూడు నెలల్లోనే పూర్తి చేసేలా మారుతి స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడని.. పక్కా కమర్షియల్‌ సినిమా విడుదల అయిన వెంటనే మారుతి మొదలు పెట్టబోతున్నాడనే వార్తలు వచ్చాయి.

ప్రభాస్‌  హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఇదే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉందంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అభిమానులు ఆ వార్తలకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాని తాజాగా మాత్రం సినిమా 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. సినిమా కాస్త ముందు వస్తుందని భావిస్తే మరీ 2024 వరకు అంటూ తాజాగా వచ్చిన వార్తలకు షాక్ అవుతున్నారు. మరీ అంత లేట్ అయితే ఎలా బాసూ అంటూ మారుతిని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభాస్ మారుతి సినిమా గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి.. అవన్నీ పుకార్లే అని తేలిపోయింది.

ఆ వార్తలు కూడా ప్రభాస్‌ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కనుక ఖచ్చితంగా 2024 రిలీజ్ వార్తలు నిజం కావద్దని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. రాజా డీలక్స్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించి విడుదల చేయాల్సిందిగా ప్రభాస్‌ ఫ్యాన్స్ దర్శకుడు మారుతిని కోరుతున్నారు.
Tags:    

Similar News