రౌడీ కోసం ఎక్కడా తగ్గని డైరెక్టర్!
ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన` కోసం పూర్తిగా కొత్త టెక్నీషియన్‌లని రంగంలోకి దించేశాడు దర్శకుడు రవికిరణ్ కోలా.;
ఒక కథని అనుకున్న విధంగా పూర్తి పర్‌ఫెక్షన్‌తో, హై క్వాలిటీతో తెరపైకి తీసుకురావాలంటే దానికి తగ్గ టెక్నీషియన్స్ ఉండాల్సిందే. అందు కోసం మన వాళ్లు ఎక్కడా వెనుకాడటం లేదు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన దగ్గరి టాలీవుడ్ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ని, టెక్నీషియన్స్‌ని ఆకట్టుకుంటోంది. దీంతో మన మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. దానికి తగ్గట్టే మన మేకర్స్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. రాజీ అసలు పడటం లేదు.
హాలీవుడ్ నుంచి సైతం టెక్నీషియన్‌లని, ఆర్టిస్ట్‌లని తెచ్చేస్తున్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఇతర భాషలకు చెందిన టాప్ టెక్నీషియన్‌లని కూడా తీసుకొస్తున్నారు. ఈ మధ్య కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మలయాళ ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్‌ల దిగుమతి పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన` కోసం పూర్తిగా కొత్త టెక్నీషియన్‌లని రంగంలోకి దించేశాడు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ సినిమాకు 1980 నేపథ్యాన్ని ఎంచుకున్న దర్శకుడు ప్రేక్షకులకు`రౌడీ జనార్ధన`తో కొత్త ఫీల్‌ని అందించాలనే ప్లాన్‌లో భాగంగా, ప్రేక్షకుల్ని అలనాటి కాలానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో పాటు ప్రధాన విభాగాల్లో కొత్త టెక్నీషియన్‌లని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడని గ్లింప్స్‌తో స్పష్టమైంది.
ఈ మూవీకి మలయాళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ సంగీతం అందించాడు. మలయాళ బ్లాక్ బస్టర్స్ మిన్నల్ మురళి, భీష్మ పర్వం, భ్రమయుగం లాంటి సినిమాలకు సంగీతం అందించి ఔరా అనిపించాడు. గ్లింప్స్‌లో వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీ ఎంత ఇంటెన్స్ డ్రామాతో సాగుతుందో స్పష్టం చేస్తోంది. అంతే కాకుండా 1980 టైమ్ పీరియడ్ మూడ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంది మలయాళ టెక్నీషియన్ ఆనంద్ సి. చంద్రన్.
ప్రేమమ్, భీష్మపర్వం, ఆనందం లాంటి సినిమాలకు పని చేశాడు. అవి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. ప్రేమమ్, భ్రమయుగం సినిమాలకు ఆనంద్ సి.చంద్రన్ అందించిన ఛాయాగ్రహణం ఆ సినిమాలకు ప్రధాన హైలైట్‌గా నిలిచి ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ప్రొడక్షన్ డిజైర్‌గా బాలీవుడ్ టెక్నీషియన్ డినోశంకర్‌ని దించాడు. తను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన `డిటెక్టీవ్ బ్యోమ్‌కేష్ భక్షి, బిగ్‌బి అమితాబ్ `వాజిర్` సినిమాలకు పని చేసిన తనని దర్శకుడు రవికిరణ్ కోలా ఏరి కోరి ఈ సినిమాకు తీసుకున్నాడు. ఇలా రౌడీ కోసం టాప్ టెక్నీషియన్స్‌ని దించేశాడు. టాప్ టెక్నీషియన్స్‌తో ఎక్కడా రాజీపడకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో రవికిరణ్ కోలా చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ని అందించడం లాంఛనమే అని గ్లింప్స్ చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు.