'రాధే శ్యామ్' సర్ప్రైజ్.. డార్లింగ్ పోస్టర్ తో టీజర్ అప్డేట్..!

Update: 2021-02-12 03:41 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించి ఓ పోస్టర్ ని వదిలారు.

ఇందులో డార్లింగ్ ప్రభాస్ చేతులు జేబులో పెట్టుకొని తనదైన శైలిలో స్టైల్ గా వాక్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఓ పెయింటింగ్ ని తలపించేలా డిజైన్ చేశారు. మరో రెండు రోజుల్లో రాబోయే 'గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్'లో ఎలాంటి అంశాలు  రివీల్ చేస్తారో చూడాలి. అదే సమయంలో ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్ - మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్ కు అప్పగించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News