ఓ ప్రభాస్‌ మేకప్‌మేన్‌ కథ!!

Update: 2015-06-09 17:30 GMT
ప్రభాస్‌ రేంజెంతో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ హీరోల్లో టాప్‌ 5 జాబితాని తిరగేస్తే అందులో టాప్‌ పొజిషన్‌లో ఉండే పేరు ప్రభాస్‌. ఇప్పటివరకూ పవన్‌, మహేష్‌ పేర్లు టాప్‌ 1, టాప్‌ 2 స్థానాల్లో దోబూచులాడుతున్నాయి. ఇక ప్రభాస్‌ నటించిన బాహుబలి రిలీజ్‌కి వచ్చేస్తోంది. ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నిటినీ అధిగమించేయడం ఖాయం అనే అనుకుంటున్నారంతా.

ఈ చిత్రం ఇంటా బైటా కలుపుకుని 100కోట్లు పైగానే వసూలు చేస్తుందని అంచనాలేస్తున్నారు. అంటే పవన్‌ పేరిట ఉన్న 84 కోట్ల వసూళ్ల రికార్డుని ప్రభాస్‌ సినిమా తుడిచేస్తుందనే అనుకోవచ్చు. ఇప్పటికే ప్రభాస్‌ పారితోషికం 15 కోట్లు పలుకుతోంది. ఇక బాహుబలి రికార్డ్సుతో రూ.20 కోట్ల రేంజును దాటిపోతుంది. అంతెందుకు ప్రభాస్‌ తనవద్ద పనిచేసే టచప్‌ బోయ్‌కే నెలకు 50వేలు పైగా జీతం ఇస్తున్నాడు. ఒకప్పటి టచప్‌ బోయ్‌ ప్రమోషన్‌పై మేకప్‌మేన్‌గా ఎదిగాడు. అతగాడికి లక్ష జీతం. ఇటీవలే పెళ్లి చేసుకుని కార్‌ కొనుక్కుని ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కూడా కొనుక్కున్నాడు.

ఒకప్పుడు ఫిలింనగర్‌లో అన్నా ల్యాబ్‌ వెనకగా ఓ చిన్న బడ్డీకొట్టులో బార్బర్‌ షాప్‌ని నెట్టుకొచ్చే ఈ ఆసామి ఇప్పుడు ఏకంగా లక్ష జీతగాడై ఓ ఇంటివాడై, జీవితంలో హాయిగా సెటిలైపోయాడు. అంటే ప్రభాస్‌ చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ రేంజులో ఎదుగుతున్నారంటే అది ప్రభాస్‌ ఎదుగుదలతోనే సాధ్యమైందనే అర్థం. అంతేనా అసలే అతడు ప్రభాస్‌ రాజు.. దాతృత్వంలో అతడిని కొట్టేవాడే లేడు.

Tags:    

Similar News