`స‌లార్` లో ప్ర‌భాస్ మ్యాన్లీ లుక్ అంత వీజీనా?

Update: 2022-03-17 02:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ క‌టౌట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌ని హైట్..వెయిట్ అన్న‌ది `బాహుబ‌లి` లాంటి వార్ చిత్రాల‌కు..క‌మ‌ర్శియ‌ల్ యాక్ష‌న్ చిత్రాల‌కు ప‌క్కాగా యాప్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్ర‌బాస్ ని కొట్టే క‌టౌట్ రానాకి త‌ప్ప   టాలీవుడ్ లో ఇంకేహీరోకి  లేద‌ని చెప్పాలి. ప్ర‌భాస్ రేంజ్ క‌టౌట్ మ‌ళ్లీ బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ మాత్ర‌మే. అలాంటి క‌టౌట్ పాత్ర‌ల్లో ట్రాన్స‌ప‌ర్మేష‌న్ కోసం ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారో తెలిసిందే.

`సాహో` లాంటి యాక్ష‌న్ సినిమాలో ప్ర‌భాస్ క‌టౌట్ స‌రిగ్గా హైలైట్ కాలేద‌ని విమ‌ర్శ ఉంది. అత‌ని మేకోవ‌ర్ స‌రిగ్గా కుద‌ర‌లేదని ఫీడ్ బ్యాక్ అప్పుడే వ‌చ్చింది. ఇటీవ‌లే ప్ర‌భాస్ పిరియాడిక్ ల‌వ్ స్టోరీ `రాధేశ్యామ్` లో ఎలా క‌నిపించారో తెలిసిందే.

ప్ర‌భాస్ లాంటి భారీ దేహంతో అంద‌మైన ల‌వ్ స్టోరీ చేయాల‌ని ట్రై చేసారు. త‌ప్పు లేదు. కానీ ప్ర‌భాస్ ని ఆ ల‌వ్ స్టోరీ లో ప్రేక్ష‌కుల‌కు ఓన్ చేసుకోలేక‌పోయారు. ముఖంలో మార్పులు.. లుక్ ప‌రంగా రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అత‌ను సెట్ కాలేద‌నే విమ‌ర్శ తెర‌పైకి వ‌చ్చింది. యాక్ష‌న్ హీరోతో ల‌వ్ స్టోరీ ఏంటి? అన్న వాద‌న వినిపించింది.

ఈ విష‌యంలో ప్ర‌భాస్ త‌ప్పిదాలు కూడా హైలైట్ అయ్యాయి. ప్ర‌భాస్ వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అశ్ర‌ద్ద చేసార‌ని ఆ కార‌ణంగా లుక్  ప‌రంగా పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌లేద‌ని అన్నారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు ఇదే ర‌క‌మైన టెన్ష‌న్ యాక్ష‌న్ మేక‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని టెన్ష‌న్ పెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్రభాస్ తో ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` అనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో డార్లింగ్ బాలీవుడ్ లో `ఆదిపురుష్` లో న‌టిస్తున్నాడు.

ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రాముడి పాత్ర‌లో అందంగా..సున్నితంగా క‌నిపించ‌డం కోసం లుక్ ప‌రంగా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అదే స‌మ‌యంలో `స‌లార్` లో యాక్ష‌న్ హీరోగా మాసీలుక్ కనిపించాలి. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య ట్రాన్స‌ప‌ర్మేష‌న్  అంత వీజీ కాదు. రెండింటిలోనూ లుక్ ప‌రంగా చాలా ఛేంజ్ చూపించాలి. మ‌రి ఇప్ప‌టివ‌ర‌కూ `స‌లార్` లుక్ బ‌య‌ట‌కు రాలేదు కాబ‌ట్టి ప్ర‌భాస్  ఎలా క‌నిపిస్తాడు? అన్న‌ది త‌ర్వాత ఆలోచిద్దాం.

కానీ `ఆదిపురుష్` షూటింగ్ పూర్త‌యింది కాబ‌ట్టి  ప్ర‌భాస్ ని - ప్ర‌శాంత్ నీల్ మ్యాన్లీగా మార్చాలి.  పూర్తిగా టైటిల్ కి త‌గ్గ‌ట్టు..స్ర్కిప్ట్ కి త‌గ్గ‌ట్టు లుక్ ని మార్చాల్సి ఉంది. ఈ విష‌యంలో అభిమానుల్లో కాస్త ఆందోళ‌న తెర‌పైకి వ‌స్తోంది. `స‌లార్`  లీక్డ్ ఫిక్స్ తో   ఇప్ప‌టికే అభిమానుల్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. లుక్ ప‌రంగా ప్ర‌భాస్ ని ఇంకా ర‌ఫ్ గా..మాస్ లుక్ లో ఎలివేట్ చేయాలని అభిప్రాయాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.
Tags:    

Similar News