'ఫరెవర్ డిజైరబుల్' జాబితాలోకి ప్రభాస్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'బాహుబలి' సినిమాతో లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కు క్రేజ్ పెంచుకున్న ప్రభాస్.. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో డైలీ చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా మధ్యమాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్.. తాజాగా హైదరాబాద్ టైమ్స్ 'ఫరెవర్ డిజైరబుల్ మెన్' జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ - మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా 2020 సంవత్సరానికి గాను లిస్టును ప్రకటించింది. విజయ్ దేవరకొండ టాప్ ప్లేస్ లోనున్న ఈ జాబితాలో ప్రభాస్ లేకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాలో ప్రభాస్ కు చోటు కల్పించకపోవడానికి కారణం.. అతన్ని 'ఫరెవర్ డిజైరబుల్' గా గుర్తించడమే అని తెలుస్తోంది.
ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో ఉంటూ వస్తున్న వారిలో కొందరిని హైదరాబాద్ టైమ్స్ 'ఫరెవర్ డిజైరబుల్' గా ఎంపిక చేస్తుంది. అంటే వీళ్ళు మోస్ట్ డిజైరబుల్ కంటే టాప్ లో ఉన్నట్లు అర్థం. వీరిని మళ్ళీ మోస్ట్ డిజైరబుల్ లిస్టులోకి తీసుకోరు. కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ విధానం ఫాలో అవుతున్నారు. ఇంతకముందు అక్కినేని నాగార్జున - విక్టరీ వెంకటేష్ - మెగాస్టార్ చిరంజీవి లను 'ఫరెవర్ డిజైరబుల్' గా ఎంపిక చేశారు. గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ లిస్టులో చేర్చారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా హైదరాబాద్ టైమ్స్ 'ఫరెవర్ డిజైరబుల్' జాబితాలోకి ప్రభాస్ ను చేర్చారు. అంటే ఇకపై మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరీలోకి ప్రభాస్ ని కన్సిడర్ చేయరు. (ఇకపోతే మహేష్ బాబు ఇప్పటికే ఇండియా వైడ్ టైమ్స్ 'ఫరెవర్ డిజైరబుల్' లో కూడా చోటు దక్కించుకున్నాడు. సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ - అక్షయ్ కుమార్ వంటి హీరోల సరసన చేరిన మహేష్.. ఈ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు)
కాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు.. ఒక పాన్ వరల్డ్ మూవీ ఉన్నాయి. ఇప్పటికే 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఫైనల్ స్టేజీకి తీసుకొచ్చిన ప్రభాస్.. 'ఆదిపురుష్' 'సలార్' షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.