ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా...?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించనున్నాడని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్21 పేరుతో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్21 ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఇటీవలే 'ఆదిపురుష్' అనే మరో సినిమా ప్రకటించాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ అనౌన్స్ చేయడంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లేట్ కానుందనే వార్తలు వచ్చాయి.
దీనికి తగ్గట్టే ఈ మధ్య వైజయంతీ మూవీస్ వారు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఎక్కడ కూడా ప్రభాస్21 హ్యాష్ ట్యాగ్ ఉపయోగించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ 'రాధే శ్యామ్' తర్వాత సినిమాగా ఉండకపోవచ్చనే వార్తలకు బలం చేకూరింది. అందులోనూ భారీ స్కేల్ లో రూపొందనున్న ఈ సినిమాకి ప్రభాస్ డేట్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది కనుక ముందుగా 'ఆదిపురుష్' ని సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది జనవరి 21న ఈ సినిమా షూటింగ్ ఫార్మల్ గా స్టార్ట్ చేస్తారని.. ఒక ఏడాదిలో టాకీ పార్ట్ పూర్తి చేసి 2022 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నట్లు మరో వార్త కూడా వచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
కాగా, సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. స్టార్ క్యాస్టింగ్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో రూపొందించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి 450 - 600 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాగా నిలుస్తుందని చెప్పవచ్చు.