ఇంతకీ ప్రభాస్ ఎక్కడ?
ఇండియాలోనే కాదు.. ప్రపంచం మొత్తంలో ఒక స్టార్ హీరో ఒక సినిమా కోసం నాలుగేళ్లకు పైగా వెచ్చించడం అన్నది అరుదైన విషయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ కోసం ఆ సాహసం చేశాడు. ఇప్పుడైతే దేశమంతా బాహుబలి కోసం ఊగిపోవడం చూసి.. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి.. ఇలాంటి సినిమా చేయడానికి ఏ హీరో అయినా ఎంత కాలం అయినా వెచ్చిస్తాడని అనేయొచ్చు. కానీ ‘బాహుబలి’ మొదలవడానికి ముందు ఈ సినిమా ఇంత స్థాయికి చేరుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కదా. ‘బాహుబలి: ది బిగినింగ్’ అయ్యాక ‘ది కంక్లూజన్’ మొదలవటానికి ముందు ఏడెనిమిది నెలల విరామం దొరికినా కూడా ప్రభాస్ మరో సినిమా గురించి ఆలోచించలేదు అదీ అతడి కమిట్మెంట్.
ఇలా నాలుగేళ్ల పాటు ‘బాహుబలి’ లోకంలోనే ఉండిపోయిన ప్రభాస్.. ఇప్పుడేం చేస్తున్నాడు..? ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత అసలెక్కడా కనిపించకుండా ప్రభాస్ ఎక్కడికెళ్లిపోయాడు..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. ప్రభాస్ కొన్ని రోజులుగా అమెరికాలో హాలిడేను ఎంజాయ్ చేస్తున్నాడట. తనకు అత్యంత సన్నిహితులైన మిత్రులతో కలిసి ప్రభాస్ యుఎస్ హాలిడేకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ప్రభాస్ ఎక్కడ హాలిడేలో ఉన్నది ఎవ్వరికీ తెలియదు. ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ రేంజిలో గుర్తింపు రావడం.. అమెరికాలో సైతం ‘బాహుబలి-2’ ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ అక్కడ మామూలుగా బయట తిరిగే పరిస్థితి లేదు. అందుకే ఓ సీక్రెట్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నాడట ప్రభాస్. త్వరలోనే ‘సాహో’ షెడ్యూల్ అమెరికాలో మొదలు కానున్న నేపథ్యంలో ప్రభాస్ అక్కడే హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/