డార్లింగ్ తో దీపికా షెడ్యూల్ ఎప్పుడంటే..?

Update: 2021-04-27 09:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ తరువాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా బాలన్స్ చేస్తూ ఫినిష్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం కాబట్టి గ్రాఫిక్స్ ఓ రేంజిలో ఉంటాయని తెలుస్తుంది. అయితే ఎప్పటినుండో ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది..? అని ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్ నెలలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్ దీపికా పాల్గొనబోతుందని టాక్. ప్రస్తుతం దీపికా కూడా చేతినిండా భారీ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే స్వయంగా నటిస్తూ సినిమాలు నిర్మిస్తోంది కూడా. అయితే ఇప్పుడు దీపికా షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ అనే సినిమా చేస్తోంది. అక్టోబర్ లోపు ఆ సినిమాను ఫినిష్ చేసి ప్రభాస్ సినిమాలో జాయిన్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై సి. అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఫ్యాన్స్ కు త్వరలో తీపికబురు చెబుతారేమో!
Tags:    

Similar News