• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటో స్టోరీ : ప్రభాస్‌...

ఫొటో స్టోరీ : ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌ అదిరింది

By - Tupaki Desk
Update: 2019-10-22 13:23 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రేపు తన పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. బాహుబలి.. సాహో చిత్రాలతో ప్రభాస్‌కు ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ దక్కింది. ప్రభాస్‌ పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల నుండే ప్రభాస్‌ పుట్టిన రోజు కౌంట్‌ డౌన్‌ చేస్తూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక రేపు బర్త్‌ డే సందర్బంగా ఫ్యాన్స్‌ ఏ రేంజ్‌ లో ట్రెండ్‌ చేయబోతున్నారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్‌ కామన్‌ డీపీ ని ఇప్పటికే విడుదల చేశారు. ఇదే సమయంలో ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌ గా ఈ స్టిల్‌ ను విడుదల చేశారు. ఈ స్టిల్‌ లో ప్రభాస్‌ చాలా స్టైలిష్‌ గా కనిపిస్తున్నాడు. బాహుబలి.. సాహో సినిమాల్లో కన్నా ఈ స్టిల్‌ లో ప్రభాస్‌ సన్నగా కనిపిస్తున్నాడు. సాహోలో చాలా స్టైలిష్‌ గా ప్రభాస్‌ కనిపించాడని టాక్‌ వచ్చింది. అయితే ఈ ఫొటోలో ప్రభాస్‌ అంతకు మించి స్టైల్‌ గా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

సాహో చిత్రం తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విభిన్నమైన ప్రేమ కథను దర్శకుడు రాధాకృష్ణ చూపించబోతున్నాడట. ఈ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్బంగా ఈ సినిమా కు సంబంధించిన ఏదైనా అప్‌ డేట్‌ ను లేదా ఫస్ట్‌ లుక్‌ ను ఇచ్చే అవకాశం ఉంది.  

Tags:    
  • Prabhas 
  • Prabhas Birthday 
  • Telugu News 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS