దేశంలోనే ప్రభాస్ నెం-1..ఆ తర్వాత `కేజీఎఫ్` స్టార్!
`బాహుబలి` ఫ్రాంఛైజీ అసాధారణ విజయం ఒక గొప్ప పాన్ ఇండియా స్టార్ ని ఆవిష్కరించింది. టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా రేంజును మించి పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించారు. ఒక్క సక్సెస్ డార్లింగ్ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. స్టార్ డమ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. దేశ..విదేశాల్లో ప్రభాస్ అంటే తెలియని అభిమాని లేడు. భారతదేశంతో పాటు చైనా..జపాన్..థాయ్ లాండ్.. కొరియన్ దేశాల్లో సైతం డార్లింగ్ కి అభిమానులు ఏర్పడ్డారంటే `బాహుబలి` తనని ఏ స్థాయికి చేర్చిందో చెప్పొచ్చు. దక్షిణాదిన అంతటి ఛరిష్మా కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్...కమల్ హాసన్ లాంటి వాళ్లకే సొంతం. బాలీవుడ్ లో అమీర్ ఖాన్..షారుక్ ఖాన్..హృతిక్ రోషన్ లాంటి దిగ్గజ నటులకు ఆ రేంజుంది. అయితే డార్లింగ్ ఇప్పుడు వాళ్లందరినీ వెనక్కి నెట్టేసారన్న టాక్ జాతీయ మీడియాలోనే వైరల్ గా మారింది.
పారితోషికం అందుకోవడంలో కానీ.. ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుల్లో కానీ.. యూత్ లో క్రేజ్ పరంగా కానీ.. ప్రభాస్ హిందీ నటుల్నే తలదన్ని ముందుకు సాగిపోతున్నారని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఖాన్ లకే సాధ్యం కానిది సాధ్యం చేసి చూపిస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్ హీరోల్ని మించిన క్వాలిటీస్ ప్రభాస్ లో ఉన్నాయన్నది ప్రధానంగా హైలైట్ అవుతోంది. హైట్..వెయిట్..గ్లామర్ ఇలా ప్రతీ అంశంలోనూ డార్లింగ్ వాళ్లందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నారన్న ముచ్చట సాగుతోంది. ప్రభాస్ తర్వాత స్థానంలో కన్నడ నటుడు యశ్ పేరు వినిపిస్తోంది. `కేజీఎఫ్` సంచలన విజయంతో అంతటి క్రేజ్ ని రాకింగ్ స్టార్ యశ్ సొంతం చేసుకున్నాడన్నది ఇండస్ట్రీల్లో సాగుతున్న చర్చ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన `కేజీఎఫ్` దేశంలో చాలా భాషల్లో సంచలన విజయాలను నమోదు చేసింది. దాదాపు 300కోట్ల నెట్ వసూలు చేసింది ఈ చిత్రం. హిందీలో యశ్ కి ఊహించని గుర్తింపు..పేరు ..క్రేజ్ తీసుకొచ్చింది కేజీఎఫ్ చిత్రం. ఆ కాన్ఫిడెన్స్ తోనే `కేజీఎఫ్ -2`ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుల్ని సైతం `చాప్టర్ -2` లో భాగం చేసారంటే యశ్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.
భారీ అంచనాల మధ్య చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు. దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తోంది. ఇక ప్రభాస్ నటించిన బాహుబలి -1 దాదాపు 600కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 2చిత్రం 1800కోట్లు వసూలు చేయడం ఒక సెన్సేషన్. ప్రభాస్ నటించిన కొత్త సినిమా `రాధేశ్యామ్` పాన్ ఇండియాలో కేటగిరిలో రిలీజ్ అవుతోంది. సాహో తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ తో సంచలనాలు సృష్టించి తన రేంజును మరోసారి చాటుకోవాలని ప్రభాస్ తపిస్తున్నారు.