ప్రభాస్‌ కేజీఎఫ్ స్టార్ కలయిక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Update: 2020-04-28 05:45 GMT

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రంను రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉండి ఉంటే సినిమా ఈ ఏడాది దసరా లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని ప్రభాస్‌ 20 చిత్రం కాస్త ఆలస్యం అయ్యేలా అనిపిస్తుంది. అయితే ప్రభాస్‌ తదుపరి చిత్రాల విషయంలో మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ఇప్పటికే 21వ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం లో చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

అశ్వినీదత్‌ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో సోషియో ఫాంటసీ చిత్రంగా ఆ చిత్రం రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఆ సినిమా ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదికి విడుదల చేస్తానంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పాడు. కాని కరోనా కారణంగా వచ్చే ఏడాది సినిమా రావడం అనుమానంగానే ఉంది. నాగ్‌ అశ్విన్‌ సినిమా పట్టాలెక్క ముందే ప్రభాస్‌ తదుపరి చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్‌ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఆ చిత్రం తర్వాత  తెలుగులో ఆయన సినిమా చేయబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఆయనకు ఇప్పటికే అడ్వాన్స్‌ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌ తో ఆయన సినిమా ఉంటుందని అంతా భావించారు. కాని ప్రభాస్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉండబోతుంది అనేది కొత్త వార్త. కేజీఎఫ్‌ 2తో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నిల్‌ వచ్చే ఏడాదికి ప్రభాస్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసే అవకాశాలున్నాయి. నాగ్‌ అశ్విన్‌ సినిమా పూర్తి కాకుండానే ప్రశాంత్‌ నీల్‌ సినిమాను మొదలు పెట్టి ఆ తర్వాత ఏడాది అంటే 2022లో ప్రభాస్‌ 22 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News