'ఆదిపురుష్' కి ప్రకృతి కూడా సహకరిస్తుందిగా..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ మూవీపైనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులే కాదు.... సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
ఇక తాజా విషయం ఏమింటంటే... ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. హీట్ వేవ్స్ కారణంగా జూన్ 19 వరకు విద్యసంస్థలకు సెలవులు ప్రకటించడం... ఆదిపురుష్ సినిమాకు కలిసి వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే.. ఆ సమయంలో పెద్ద సినిమాలు సైతం ఏమి విడుదల కావడం లేదు.
అందులోనూ ఇది రామాయణం ఇతివృత్త ఆధారంగా తెరకెక్కిన సినిమా. అటు పిల్లలను, ఫ్యామిలీస్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. దీనితో
ఆదిపురుష్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మాత్రం ఎక్కువ స్థాయిలో వస్తాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ఇక ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సైతం భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. కార్తికేయ ప్రోడ్యూసర్ అభిషేక్ ఆగర్వాల్ కూడా ఈ సినిమాకు 10వేల టికెట్లను డోనేట్ చేశారు. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.
సుమారు రూ.500కోట్ల భారీ బడ్జెట్‍తో ఆదిపురుష్ రూపొందినట్టు తెలుస్తోంది. కాగా, నాన్ థియేట్రికల్ రైట్స్, దక్షిణాది రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కలిపి ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నిర్మాతలకు రూ.400కోట్లపైగా రికవరీ అయ్యాయని బాలీవుడ్ వర్గాలు లెక్కలు వేశాయి. సినిమా కలెక్షన్లు రూ.వెయ్యి కోట్లు దాటుతాయని అంచనాలు ఉన్నాయి.