పవన్ నిద్రతో పోగొట్టుకున్న హిట్టు కథలు

Update: 2023-02-10 08:00 GMT
దర్శకులు కథ చెప్పేటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిద్రపోతారనే సంగతి మనం ఇప్పటికే చాలా సార్లు విన్నాం. గతంలో పూరిజగన్నాథ్ ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి చిత్రాల కథలు గురించి వివరించేటప్పుడు పవన్ నిద్రలోకి జారుకున్నారని అలా ఈ సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇదే విషయాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చెప్పారు.

తాను అతడు సినిమా కథ గురించి చెప్పేటప్పుడు పవన్ స్టార్ పొడుకున్నారని, అందుకే ఆ కథతో మహేష్ తో చేసినట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే విషయాన్ని మరోసారి ప్రస్తావించి.. పవన్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు దర్శకుడు క్రిష్. తాజాగా పవన్తో పాటు అన్స్టాపబుల్  2షోకు గెస్ట్గా వచ్చిన ఆ విషయాన్ని చెప్పి నవ్వులు పూయించారు. ఎవరన్నా స్టోరీ నరేట్ చేసేటప్పుడు నిద్రపోయారా? అంటూ నవ్వులు తెప్పించారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.

ఈ ఎపిసోడ్ రెండో భాగం రాత్రి పదింటి నుంచి స్ట్రీమింగ్ కానుందని మరోసారి గుర్తు చేసింది. ఇకపోతే పవన్ అన్స్టాపబుల్ తొలి ఎపిసోడ్ విషయానికొస్తే..  పవన్‌కల్యాణ్‌ వివిధ అంశాలపై మాట్లాడారు. 'ఈ మూడు పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా' అని బాలకృష్ణ ప్రశ్నించగా అందుకు తనదైన స్టైల్లో అదిరిపోయే బదులిచ్చారు. ఇక రాజకీయాల్లోకి, సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? అసలు తాను ఏమవ్వాలని అనుకున్నారు? తన ఆఖరి సినిమా ఎప్పుడూ? సహా పలు విషయాలు గురించి చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్కు అదిరిపోయే రికార్డ్ వ్యూస్ కూడా వచ్చాయి.

ఇకపోతే పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతోందీ చిత్రం. దీంతోపాటే హరీశ్‌ శంకర్‌తో కలిసి 'భవదీయుడు భగత్‌సింగ్‌' తో అలరించనున్నారు. ఇంకా రీసెంట్ గా సాహో దర్శకుడు సుజిత్తో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ OG చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. త్వరలోనే వినోదయ సిత్తం తెలుగు రీమేక్ను సెట్స్ పైకి తీసుకెళ్తారని వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News