• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ కెరియర్లోనే పవర్ఫుల్...

చరణ్ కెరియర్లోనే పవర్ఫుల్ పాత్ర .. 'సిద్ధ'

By - Tupaki Desk
Update: 2021-02-17 23:30 GMT
ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. చరణ్ హీరోగా చేసిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చరణ్ 'ఆచార్య' సినిమాలోను చేస్తున్నాడు. చిరంజీవి - కాజల్ నాయకా నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

దేవాలయ భూముల ఆక్రమణ .. అవినీతి రాజకీయనాయకుల ఆగడాలు .. వాళ్లని ప్రశ్నించే ఓ నిజాయితీగల పౌరుడిగా చిరంజీవి చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్రను చరణ్ చేస్తున్నాడు. తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా, ఆ పాత్ర సినిమా అంతటా తన ప్రభావం చూపుతూనే ఉంటుందట. చరణ్ పాత్ర పేరు 'సిద్ధ' .. ఈ పాత్రను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడని చెబుతున్నారు. గుండెల నిండా .. కండల నిండా నీతి నిజాయితీలను నింపుకున్న యువకుడిగా ఆయన ఈ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

సమాజానికి పట్టిన చీడను వదిలించాలనే పట్టుదలతో ముందుకుసాగేదిగా 'సిద్ధ' పాత్ర ఉంటుందనీ, అవినీతిని సమాధి చేసే ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే ఈ పాత్రలో చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. 'సిద్ధ' పాత్రలో చరణ్ లుక్ .. ఆయన డైలాగ్ డెలివరీ .. యాక్షన్ ఎపిసోడ్ .. కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. చరణ్ ఇంతవరకూ చేసిన గుర్తుండిపోయే పాత్రల్లో 'సిద్ధ' పాత్ర ప్రధానంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరపై పూజా హెగ్డేతో కలిసి ఆయన చేసే సందడిని చూసితీరవలసిందేనని అంటున్నారు.  
Tags:    
  • Koratala Siva 
  • Koratala Siva Movies 
  • Aacharya 
  • Chiranjeevi 
  • Ram Charan 
  • Aacharya Movie Shooting 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS