మరో పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు..తెలుగు లో సక్సెస్ అవుతాడా మరి!
పవన్ కల్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు అలా స్థిర పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగు వాళ్లలో పవన్ కల్యాణ్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే కాక.. ప్రత్యేకమైన మ్యానరిజమ్‌తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ పెద్ద ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా సంపాదించుకున్నారు. అందుకే రాజకీయపార్టీని కూడా నడిపిస్తున్నారు. తెలుగులో అత్యధిక మాస్ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా నిలిచారు. అయితే పవర్‌స్టార్ అన్న బిరుదు తెలుగులోనే కాదు ఇతర భాషల్లోని నటులు కూడా తగిలించుకున్నారు. అన్ని భాషల్లోనూ మెగాస్టార్లు, సూపర్స్టార్లు ఉన్నట్టే పవర్స్టార్లూ తయారయ్యారు.
తమిళంలో శ్రీనివాసన్ అనే కమెడియన్ తన పేరు వెనుక ‘పవర్ స్టార్’ తగిలించుకున్నాడు. శ్రీనివాసన్ ఓ కమెడియన్ కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. కన్నడ నటడు పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఉంది. పునీత్ కన్నడ నాట పెద్ద హీరో. అంతేకాక ఆయన రాజ్‌కుమార్ తనయుడు కావడంతో అక్కడి ప్రజల్లో ప్రత్యేక అభిమానముంది.
చిన్నప్పటి నుంచి పునీత్ సినిమాల్లో నటిస్తున్నాడు. జాతీయస్థాయిలో ఉత్తమ బాలనటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. మరోవైపు కన్నడ ఇండస్ట్రీలో పునీత్ చాలా పెద్ద మాస్ఫాలోయింగ్ ఉన్నది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పునీత్‌ను కన్నడ పరిశ్రమకు హీరోగా పరిచయం చేసింది మన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.
‘అప్పు’ అనే సినిమాతో పునీత్ కన్నడనాట మాస్‌హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఈ సినిమానే ఆ తర్వాత ఇడియట్ పేరుతో తెలుగులో రీమేక్ అయి ఇక్కడ కూడా సూపర్‌హిట్ సాధించింది. తెలుగులో విజయం సాధించలేకపోయిన ఆంధ్రావాలా .. కన్నడ పునిత్ తో తీస్తే అక్కడ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.
పునీత్ అనేక బ్లాక్బస్టర్లు కొట్టి కన్నడ నాట మాస్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడీ కన్నడ పవర్‌స్టార్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు నటించిన ‘యువరత్న’ అనే సినిమా తెలుగులో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాలో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ సినిమాలు తెలుగులో పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు.. ఉపేంద్రకు మాత్రం ఇక్కడ కొద్దిగా మార్కెట్ ఉండేది. తెలుగులోనూ ఉపేంద్రకు అభిమానులు ఉన్నారు. కానీ ‘కేజీఎఫ్’ సినిమా మాత్రం తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో కన్నడ నటులకు మళ్లీ టాలీవుడ్ లో పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి వచ్చింది.