రెండో వివాహం దిశగా స్టార్ ప్రొడ్యూసర్ అడుగులు
ఆయన టాలీవుడ్ లోని టాప్ లీగ్ ప్రొడ్యూసర్. త్వరలో రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ నిర్మాత సతీమణి మూడేళ్ల క్రితం కాలం చేశారు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా తనకు వివాహం అయింది. సతీమణి వియోగం తర్వాత నిర్మాతగారు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. దీంతో ఆయన తోడు కోసం రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ ప్రొడ్యూసర్ వివాహబంధంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలలో ఉన్న విషయం ఇప్పటికే సన్నిహితులకు తెలుసని సమాచారం. అయితే ఈ విషయం పూర్తిగా వ్యక్తిగతమైనది కావడంతో హడావుడి లేకుండా సన్నిహతుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఆయన మ్యారేజ్ చేసుకోబోయే యువతి మరో సామాజిక వర్గానికి చెందిన యువతి అని.. ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధం లేని వ్యక్తి అని సమాచారం.
నిర్మాత సన్నిహితులు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారని.. ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉండడం.. ఒక తోడు అవసరం అని ఈ వివాహం విషయంలో ప్రోత్సహించారని అంటున్నారు. త్వరలోనే ఈ మ్యారేజ్ జరుగుతుందని అంటున్నారు.